Visha Yogam: శని చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 3 రాశుల వారు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి

Published : Sep 29, 2025, 07:34 AM IST

Visha Yogam 2025: విష యోగం అశుభకరమైనది. ఇది ఎవరికీ మేలు చేయదు.  మీనరాశిలో శని, చంద్రుల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి కష్టాలు వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

PREV
14
విష యోగం అంటే ఏమిటటి?

జ్యోతిషశాస్త్రం ప్రకారం విష యోగం మంచిది కాదు. ఇది అశుభ యోగం.  ఈ యోగం వల్ల  ఆర్థిక, కుటుంబ జీవితం ఎంతో ప్రభావితమవుతుంది.  అక్టోబర్ 6న శని, చంద్రులు మీనరాశిలో కలవబోతున్నారు. దీని వల్ల విష యోగం ఏర్పడుతుంది.  నవగ్రహాలలో చంద్రుడు తన రాశిని వేగంగా మార్చుకుంటాడు. అతడు ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మీనరాశిలో శనితో కలిసి విష యోగాన్ని సృష్టిస్తున్నాడు. శని, చంద్రులు పరస్పర విరుద్ధ స్వభావాలున్నవారు.  ఈ రెండు గ్రహాల కలయిక మూడు రాశుల వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది.

24
మేష రాశి

మేష రాశి వారి జాతకంలో 12వ ఇంట్లో ఈ విష యోగం ఏర్పడబోతోంది. ఇది వారికి ఆర్థికపరమైన కష్టాలను తెచ్చి పెడుతుంది. హఠాత్తుగా ఖర్చులు పెరిగిపోతాయి. ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అప్పులు కూడా చేయాల్సి రావచ్చు.  భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు కొన్ని రోజుల పాటూ నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. సహోద్యోగులతో వీరికి విభేదాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల పనిభారం కూడా పెరిగిపోతుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సమయంలో కొన్ని రోజుల పాటూ పెట్టుబడులకు దూరంగా ఉండడం ఉత్తమం. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం వల్ల తీవ్రమైన సమస్యల బారిన పడతారు.

34
సింహ రాశి

సింహ రాశి వారి జాతకంలో ఎనిమిదవ ఇంట్లో విష యోగం ఏర్పడుతుంది. దీని వల్ల వారి ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.  వీరికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  వైద్యపరంగా ఖర్చులు అతిగా పెరుగుతాయి. అనవసరమైన చికిత్స లేదా ఊహించని పరిస్థితుల కోసం డబ్బు వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ దగ్గరి వారే మీకు చెడ్డ పేరును తేవచ్చు. ఇది పెట్టుబడులకు ఏమాత్రం మంచి సమయం కాదు. ఆర్థికపరమైన నిర్ణయాలను వాయిదా వేయండి. 

44
మీన రాశి

శని, చంద్రుల కలయిక వల్ల ఏర్పడే విష యోగం మీనరాశిలోనే ఏర్పడుతుంది. కాబట్టి ఆ రాశి వారికి చెడు ప్రభావాలు తప్పవు.  ఈ యోగకాలం కొన్ని రోజుల పాటే ఉంటుంది. ఆ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.  డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వైవాహిక జీవితం, జీవిత భాగస్వామి ఆరోగ్యం, కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలో కూడా భావోద్వేగాలు అధికంగా ఉన్న సమయంలో నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబ జీవితంలో మూడో వ్యక్యి జోక్యాన్ని అనుమతించవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి.

(నిరాకరణ: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం జ్యోతిషశాస్త్ర అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని ఏషియానెట్ తెలుగు ధృవీకరించలేదు. సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయత, ప్రభావాలకు ఏషియానెట్ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు)

Read more Photos on
click me!

Recommended Stories