Zodiac signs: పెళ్లి తర్వాత ఈ అమ్మాయిలది మహారాణి యోగమే..!

Published : Jul 28, 2025, 12:16 PM IST

పుట్టినప్పుడు జీవితం ఎలా ఉన్నా… కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలకు.. పెళ్లి తర్వాత జీవితమే మారిపోతుంది. ముఖ్యంగా.. జోతిష్యశాస్త్రంలోని కొన్ని రాశులకు చెందిన అమ్మాయిల జీవితం పెళ్లి తర్వాత మహారాణి యోగమే. మరి, ఆ రాశులేంటో చూద్దామా… 

PREV
15
Zodiac signs

పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుంది.  పుట్టింట్లో ఎంతో సంతోషంగా, గారాభంగా పెరిగినా.. అత్తింట్లో ఎక్కువ కష్టాలు పడాల్సి ఉంటుంది అనే భయం చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది. కానీ, జోతిష్యశాస్త్రంలో కొన్ని రాశుల అమ్మాయిల జీవితం మాత్రం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతుంది.  మహారాణి యోగం పొందుతారు.  మరి, ఆ రాశులేంటో చూద్దామా…

25
సింహ రాశి..

సింహ రాశి స్త్రీలు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు రాణిలాంటి గంభీరమైన రూపాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. వారు తమ కుటుంబంలో గౌరవం పొందాలని ఆశిస్తారు. ఈ లక్షణాలు వారి అత్తగారింట్లో వారికి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తాయి. వారి ఆత్మవిశ్వాసం, దాతృత్వం, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు, ప్రేమ స్వభావం వంటివి అత్తగారింట్లో గొప్పతనాన్ని తెచ్చిపెడతాయి. తమ ప్రతిభ, ప్రేమతో అత్తమామల, కుటుంబ సభ్యుల గౌరవాన్ని సులభంగా గెలుచుకుంటారు. ఆ ఇంటికే మహారాణి అవుతారు. వారు ఏం చెబితే.. అదే ఇంట్లో అందరూ ఫాలో అవుతారు.

35
కర్కాటక రాశి..

కర్కాటక రాశి స్త్రీలు ప్రేమ, అనురాగం కలిగినవారు. కుటుంబ అనుబంధానికి ఎక్కువ విలువ ఇస్తారు. వారికి సహజంగానే బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే గుణం ఉంటుంది. తల్లి లక్షణాలు కలిగిన వారు కుటుంబాన్ని ఆదరించాలనే కోరిక కలిగి ఉంటారు. ప్రేమ, భావోద్వేగం, కుటుంబ అనుబంధం, శ్రద్ధ, భద్రతా భావం, త్యాగం వంటి లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. వారు తమ భర్త, అత్తమామల కుటుంబాన్ని తమ సొంత కుటుంబంగా భావించి ప్రేమిస్తారు. అత్తగారి అవసరాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తారు. అత్తగారింటి అభివృద్ధికి తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. దీనివల్ల అత్తగారింటి ప్రేమ, ఆదరణ పొంది ఇంట్లో ముఖ్యమైన వ్యక్తిగా నిలుస్తారు.

45
తుల రాశి..

తుల రాశి స్త్రీలు సహజంగానే న్యాయంగా, సమతుల్యంగా, ప్రశాంతంగా ఉంటారు. వారు గొడవలు, వివాదాలను తప్పించుకుని అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి ఇష్టపడతారు. వారి మాటతీరుతో  అత్తగారింట్లో సంబంధాలను సానుకూలంగా మార్చుకుంటారు.   ఏదైనా సమస్య వచ్చినా దాన్ని ప్రశాంతంగా, దౌత్యపరంగా పరిష్కరించి అందరూ ఇష్టపడే కోడలుగా ఉంటారు. అత్తగారు వారిని సలహాదారుగా, కుటుంబ సభ్యురాలిగా గౌరవిస్తారు. ఇంట్లో వీరి పెత్తనమే కొనసాగుతుంది.

55
మీన రాశి..

మీన రాశి స్త్రీలు చాలా మృదువుగా ఉంటారు. దయ కలిగి ఉంటారు.  వారికి సహజంగానే త్యాగ స్వభావం ఉంటుంది. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఊహాశక్తి ఎక్కువగా ఉన్న వారు కొన్నిసార్లు కలల ప్రపంచంలో బ్రతికేవారిలా కనిపించినా, బంధాల విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. సులభంగా సర్దుకుపోయే గుణం, సృజనాత్మకత, త్యాగం, దయ, వంటి లక్షణాలు కలిగి ఉంటారు. అత్తగారికి నచ్చే విధంగా ఉంటూనే.. తాము అనుకున్నది సాధించుకుంటారు. అత్తారింట్లో మహారాణిలా జీవిస్తారు.

(పైన పేర్కొన్న రాశుల వారు మాత్రమే అత్తగారింట్లో రాణిలా బ్రతుకుతారని కాదు. వారికి కొన్ని లక్షణాలు ఉండటం వల్ల జ్యోతిష్యం ప్రకారం వారికి అత్తగారింట్లో రాణిలా బ్రతికే అవకాశం ఉందని ఈ కథనంలో వివరించాం. అయితే, ఏ రాశికి చెందిన స్త్రీలైనా తమ వైఖరి, అవగాహనతో అత్తగారింట్లో మంచి సంబంధాలు కొనసాగించవచ్చని గుర్తుంచుకోండి. ఈ సమాచారం ఇంటర్నెట్‌లో లభించే అంచనాలు, జ్యోతిష్కులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా మాత్రమే. దీనికి ఏషియానెట్ తెలుగు సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే అనుభవజ్ఞులైన జ్యోతిష్కుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది)

Read more Photos on
click me!

Recommended Stories