Zodiac sign: వచ్చే ఏడాది శని ఎక్కువ కాలం ఒంటరిగా సంచరిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటాడు. దీంతో కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాంతి చర్యలు చేపడితే ప్రతికూలతలు తగ్గుతాయి.
శనిని అనుకూలంగా మార్చుకోవాలంటే నిర్లక్ష్యం పనికిరాదు. నిత్యం శనికి దీపారాధన చేయడం, శని ఆలయాల్లో ప్రదక్షిణలు చేయడం, నలుపు రంగు కలిసిన దుస్తులు ధరించడం, శివ పూజ చేయించడం చాలా ఉపయోగకరం. ఈ విధానాలు పాటిస్తే శని దోష ప్రభావం తగ్గి కష్టకాలం నుంచి బయటపడే అవకాశాలు మెరుగవుతాయి.
25
మేష రాశి వారికి ఖర్చులు
మేష రాశివారికి వ్యయ స్థానంలో శని ప్రభావం కొనసాగుతోంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువవుతాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవసరం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
35
సింహ రాశి వారికి అనుకోని కష్టాలు
సింహ రాశివారికి అష్టమ స్థాన శని కారణంగా అనుకోని కష్టాలు ఎదురవుతాయి. నమ్మినవారే దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారు శనిని సంతృప్తిపరచే ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలి. అప్పుడు కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి.
కన్య, ధనుస్సు రాశుల వారికి ఆటంకాలు, మానసిక ఒత్తిడి
కన్య రాశివారికి ప్రతి పనిలో ఆలస్యం ఎదురవుతుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగవు. దాంపత్య జీవితంలో అసంతృప్తి పెరుగుతుంది. ధనుస్సు రాశివారికి మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబ సమస్యలు తీవ్రతరం అవుతాయి. ఆస్తి సంబంధిత విషయాలు తలనొప్పిగా మారుతాయి. శనికి తరచూ ప్రదక్షిణలు చేయడం వల్ల పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది.
55
కుంభం, మీన రాశులు: ఆర్థిక ఒత్తిడి, పురోగతి మందగింపు
కుంభ రాశివారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో మాటభేదాలు తలెత్తుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. మీన రాశివారికి వృత్తి రంగంలో ఎదుగుదల తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఈ రెండు రాశుల వారు శివార్చన చేయించడం, శనికి దీపం వెలిగించడం కొనసాగిస్తే దశ క్రమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.