Zodiac sign: జాగ్ర‌త్త సుమా.. 2026లో ఈ రాశుల‌ వారికే న‌ర‌క‌మే, జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే

Published : Dec 26, 2025, 05:33 PM IST

Zodiac sign: కొత్త సంవత్సరం వచ్చిందంటే అందరికీ ఆశలు పెరుగుతాయి. అయితే జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం 2026లో కొన్ని రాశుల వారికి పరిస్థితులు అంత సానుకూలంగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. శని సంచారం, రాహు ప్రభావంతో కొన్ని రాశుల‌కు ఇబ్బంది త‌ప్ప‌దు. 

PREV
14
శని, రాహు ప్రభావం ఎందుకు కీలకం?

జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహు గ్రహాలను అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తారు. ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు జీవితంలో స్థిరత్వం కనిపిస్తుంది. ప్రతికూలంగా మారితే ఆలస్యం, నష్టం, అపార్థాలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 2026లో కొన్ని రాశులపై ఈ రెండు గ్రహాల ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

24
మేష రాశి – శ్రమ ఉన్నా ఫలితం దక్కని పరిస్థితి

మేష రాశి వారిపై శని, రాహు సంచారం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఆర్థిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. తీసుకునే నిర్ణయాలు ఆలస్యంగా అమలవుతాయి. కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా లేకపోవచ్చు. ఓర్పుతో వ్యవహరించాల్సిన సమయం ఇది.

34
సింహ రాశి – మొదలైన పనులు మధ్యలోనే ఆగే ప్రమాదం

సింహ రాశి వారికి రాహు ప్రభావం ఎక్కువగా కనిపించనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త పనులు ప్రారంభించాలనుకున్నా అవి పూర్తి కాకుండా ఆగిపోవచ్చు. డబ్బు సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో మాటల తగాదాలు పెరిగి మానసిక ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

44
కుంభ, మీన రాశులు – ఏలినాటి శని ప్రభావం

కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉండటంతో సమస్యలు ఇంకా కొనసాగవచ్చని అంటున్నారు . ఉద్యోగ రంగంలో గుర్తింపు తగ్గడం, వ్యాపారంలో అనుకోని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మీన రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కావడంతో 2026 అంతా జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. చేసిన పనులకు అపార్థాలు రావడం, నిందలు ఎదురవడం, ఆర్థికంగా ఒడిదుడుకులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

గమనిక: పైన తెలిపిన వివ‌రాలు కొంత‌మంది జ్యోతిష్య పండితులు, ఇంట‌ర్నెట్ వేదిక‌గా అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించిన‌వే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories