Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026 గోల్డెన్ ఇయర్ ,డబ్బుకు లోటు ఉండదు..!

Published : Dec 26, 2025, 12:18 PM IST

Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ఈ కొత్త సంవత్సరం అద్బుతంగా ఉండనుంది.ముఖ్యంగా డబ్బు పరంగా బాగా కలిసిరానుంది. ఆ తేదీలేంటో చూద్దాం....

PREV
14
నెంబర్ 1...

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026 గోల్డెన్ ఇయర్ గా మారనుంది. ఈ 2026లో వీరికి వ్యాపారాల నుంచి అపారమైన ధనం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి కూడా సాధించే అవకాశం ఉంది. వీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా పెద్ద ఆర్థిక లాభాన్ని తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో లాభాలు అందుకుంటారు.

24
నెంబర్ 3...

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. వీరిని గురు గ్రహం పాలిస్తూ ఉంటుంది.ఈ కొత్త సంవత్సరం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయం పొందుతారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే... అవి ఇప్పుడు మీకు అందుతాయి.

34
నెంబర్ 5...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. 2026లో వీరికి షేర్ మార్కెట్, ట్రేడింగ్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో భారీ లాభాలు అందుకుంటారు. తెలివితేటలతో కొత్త ఆదాయ మార్గాలు సృష్టిస్తారు. ప్రయాణాల ద్వారా కూడా ధన ప్రాప్తి ఉంటుంది.

44
నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. వీరిపై కుజ గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఈ తేదీల్లో పుట్టిన వారు ధైర్యంగా ఎందులో పెట్టుబడులు పెట్టినా.. మంచి లాభాలు పొందగలరు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వీరికి చాలా బాగుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories