Zodiac sign: జ‌న‌వ‌రి 12 నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు.. మ‌క‌ర రాశిలోకి శుక్రుడు సంచారం

Published : Jan 07, 2026, 04:46 PM IST

Zodiac sign: శుక్ర గ్రహం సంపద, సుఖాలు, ఐశ్వర్యానికి కారకుడు. అలాంటి శుక్రుడు శనికి చెందిన మకర రాశిలో సంచరిస్తే కొన్ని రాశుల జీవితాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 6 వరకు మకర రాశిలో శుక్రుడి గోచారం కొనసాగనుంది. 

PREV
16
మేషం: ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో ఊహించని పురోగతి

మేష రాశివారికి శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దీంతో ఉద్యోగ జీవితంలో ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పెట్టుబడుల ద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి.

26
వృషభం: అదృష్టం పూర్తిగా కలిసి వచ్చే కాలం

వృషభ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం పెద్ద శుభసూచకం. నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల్లో పెరుగుదల ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. విదేశీ ప్రయాణాలు లేదా ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సంతాన సంబంధ శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది.

36
కన్య: ఆకస్మిక ధన లాభాలు

కన్య రాశివారికి శుక్రుడు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ధనయోగాలు బలపడతాయి. అనుకోని ఆదాయం రావచ్చు. పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పితృ సంపత్తి లాభం దక్కే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నిలకడగా లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

46
తుల, మకరం: రాజయోగాలు, అధికార యోగాల సూచనలు

తుల రాశివారికి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.

56
మకర రాశి: శుభ ఫలితాలు

మకర రాశివారికి శుక్రుడు స్వరాశిలో సంచరించడం వల్ల అత్యంత శుభఫలితాలు కనిపిస్తాయి. అధికార స్థానాలు, గౌరవం పెరుగుతాయి. కోరికలు నెరవేరే కాలం ఇది. ప్రేమ, వివాహ విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.

66
మీనం: ఆదాయం పెరిగే కాలం

మీన రాశివారికి శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఆర్థికంగా బలపడతారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది, హోదా మారుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభవార్తలు, పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు ఉన్నాయి.

గ‌మ‌నిక‌: పైన పేర్కొన్న విష‌యాలు ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం. ప‌లువురు పండితులు తెలిపిన వివ‌రాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మనించాలి.

Read more Photos on
click me!

Recommended Stories