Zodiac sign: ఏలిననాటి శని ప్రభావం ఉన్న కుంభ రాశి వారికి ఈ వారం చాలా కీలకం. కెరీర్, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆరోగ్యం అన్నింటిలోనూ సమతుల్యం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వారం పనుల ఒత్తిడి, ప్రయాణాల వల్ల శారీరక అలసట వచ్చే సూచనలు ఉన్నాయి. సరైన నిద్ర లేకపోతే నీరసం పెరుగుతుంది. ఆహారంలో నియమాలు పాటించాలి. మానసిక ఒత్తిడి తగ్గాలంటే యోగ, ధ్యానం చేయడం మంచిది.
25
ఉద్యోగ రాశిఫలం
ఉద్యోగస్తులకు కెరీర్ మార్పు ఆలోచనలు రావచ్చు. భావోద్వేగాలకు లోనై పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కార్యాలయంలో నిబంధనలు పాటించాలి. అబద్ధాలు, తప్పుదారి పట్టించే మాటలు మీ పేరుప్రతిష్ఠకు నష్టం కలిగించవచ్చు.
35
వ్యాపార రాశిఫలం
వ్యాపారస్తులు ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండడం ఉత్తమం. వారం మధ్యలో భూమి, ఇల్లు కొనుగోలు లేదా అమ్మకం జరిగే అవకాశం ఉంది. డాక్యుమెంట్ల విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు.
ఆర్థికంగా ఈ వారం సమతుల్యంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువైనా ఆదాయం కొనసాగుతుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. బడ్జెట్ ప్రకారం నడిస్తే లాభం ఉంటుంది.
55
ప్రేమ, కుటుంబం, విద్య రాశిఫలం
కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తవచ్చు. గతంలో మాట్లాడిన మాటలు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మాటలపై నియంత్రణ అవసరం. ప్రేమ సంబంధాల్లో తొందరపాటు వద్దు. భాగస్వామి భావాలను గౌరవించాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. యువత కెరీర్ నిర్ణయాల్లో ఓర్పు అవసరం. వీరికి లక్కీ నెంబర్ 8గా ఉంటుంది. అలాగే స్కై బ్లూ కలర్ ధరిస్తే మంచిది. ఇక శనివారం రోజున అవసరమైన వారికి నల్ల నువ్వులు లేదా దుప్పటి దానం చేస్తే మంచి జరగుతుంది.
గమనిక: ఇది సాధారణ రాశిఫల సమాచారం మాత్రమే. వ్యక్తిగత నిర్ణయాలకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఇందులో పేర్కొన్న విషయాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.