Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారితో ప్రేమ అంత ఈజీ కాదు.. చుక్కలు చూపిస్తారు!

Published : Dec 23, 2025, 12:17 PM IST

ప్రేమ ప్రయాణం కొన్నిసార్లు సాఫీగా సాగుతుంది. మరికొన్నిసార్లు మన సహనానికి పరీక్ష పెడుతుంది. అలా ప్రేమ కాస్త కష్టంగా అనిపించే వ్యక్తుల వెనుక కారణం వారి మనసు మాత్రమే కాదు, వారు పుట్టిన నక్షత్రం కూడా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

PREV
16
Birth Stars astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి స్వభావం, ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ వారు పుట్టిన నక్షత్రం ప్రభావంతో ముడిపడి ఉంటాయి. ప్రేమ విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారితో ప్రేమ ఓ పరీక్షలా ఉంటుంది. వీరు ప్రేమను తేలికగా తీసుకోరు. అలాగే ఒకసారి ప్రేమలో పడితే.. జీవితాంతం విడిచిపెట్టరు. మరి ఆ నక్షత్రాలేంటో చూద్దామా… 

26
అనూరాధ నక్షత్రం

అనూరాధ నక్షత్రం వారు ప్రేమ కోసం ఏదైనా చేస్తారు. కానీ అదే స్థాయిలో ప్రతిఫలం కోరుకుంటారు. చిన్న నిర్లక్ష్యం కూడా వారిని లోపల నుంచి బాధపెడుతుంది. బయటికి చెప్పకపోయినా మనసులో మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ నక్షత్రంలో పుట్టినవారితో ప్రేమ సాగించాలంటే.. భావోద్వేగ సమతుల్యత ముఖ్యం.

36
ఆశ్లేష నక్షత్రం

ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారి భావోద్వేగాలు లోతుగా ఉంటాయి. ప్రేమలో వీరు నమ్మకంగా ఉంటారు. చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలతో బాధపడతారు. ప్రేమించే వ్యక్తి పూర్తిగా తమ సొంతం కావాలని కోరుకుంటారు. స్వేచ్ఛ ఇస్తారు. కానీ అదే సమయంలో పూర్తి నిజాయతీని ఆశిస్తారు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని అర్థం చేసుకోవడానికి ఓపిక అవసరం.

46
జ్యేష్ఠ నక్షత్రం

జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారితో ప్రేమ సవాళ్లతో కూడుకున్నది. వీరు సహజంగా నాయకులు. వీరి ప్రేమలో కూడా ఆధిపత్య భావం ఉంటుంది. తమ ప్రేమను వ్యక్తపరచడంలో కాస్త కఠినంగా కనిపించినా.. లోపల మాత్రం విపరీతమైన ప్రేమ ఉంటుంది. తమను తక్కువ చేసి మాట్లాడటం, నిర్లక్ష్యం చేయడం వీరికి అస్సలు నచ్చదు. గౌరవం ఇచ్చినంత కాలం వీరు ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. కానీ ఒకసారి అవమానం జరిగితే ఆ ప్రేమను వదిలేయడానికి కూడా వెనుకాడరు. 

56
మూల నక్షత్రం

మూల నక్షత్రం వారు ప్రేమ విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు. ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తారు. భావోద్వేగాలను దాచుకోవడం వీరి వల్ల కాదు. ప్రేమలో నిజాయతీగా ఉంటారు. కానీ కఠినమైన మాటలు మాట్లాడుతారు. వీరు ప్రేమను చాలా సీరియస్ గా తీసుకుంటారు. అందుకే చిన్న చిన్న డ్రామాలు, అబద్ధాలు వీరికి నచ్చవు. 

66
శతభిష నక్షత్రం

శతభిష నక్షత్రంలో పుట్టిన వారు కాస్త భిన్నంగా ఉంటారు. వీరు భావాలను బయటకు చెప్పరు. ప్రేమలో ఉన్నా కూడా బయటపడరు. వీరి మౌనం ఎదుటివారిలో గందరగోళం సృష్టిస్తుంది. ప్రేమిస్తున్నారా లేదా అనే సందేహం భాగస్వామికి తరచూ కలుగుతుంది. కానీ వీరు ప్రేమిస్తే మాత్రం విపరీతంగా ప్రేమిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories