Zodiac sign: డిసెంబర్ 20వ తేదీ శుక్ర గ్రహం వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి గోచారం చేసింది. ఇది 2025లో శుక్ర గ్రహానికి చివరి గోచారం. దీనివల్ల కొన్ని రాశుల వారికి సవాళ్లను తీసుకొస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
డిసెంబర్ 11, 2025 నుంచే శుక్ర గ్రహం అస్త స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలోనే డిసెంబర్ 20 ఉదయం 7:50 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్రవేశించింది. అక్కడ 24 రోజుల పాటు ఉండి, 2026 జనవరి 12న మకర రాశిలోకి వెళ్తుంది. అస్త స్థితిలో ఉన్న శుక్రుడు సాధారణంగా ఆశించిన ఫలితాలను ఇవ్వడు. ఈ శుక్ర గోచారం కర్కాటక, వృశ్చిక, తుల, మీన రాశుల వారికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో జీవితంలో అనుకోని మార్పులు, మానసిక ఒత్తిడులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
25
కర్కాటక రాశి అనవసర ఖర్చులు
ఈ గోచారం కర్కాటక రాశికి ఆరవ స్థానంలో జరుగుతుంది. కుటుంబంలో మాటభేదాలు, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో పనిభారం ఎక్కువవుతుంది. శుక్రవారం తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
35
వృశ్చిక రాశి వారికి ఆర్థిక నష్టం
రెండో స్థానంలో శుక్ర గోచారం జరగడం వల్ల ఆర్థిక నష్టం కలగవచ్చు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో వివాదాలు రావచ్చు. ఇంట్లో వాళ్లతో మాటపోటీ పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం పేదలకు పాలు, బియ్యం లేదా ఖీర్ దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది.
మూడో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులు కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్ర గ్రహ అనుగ్రహం కోసం శుక్ర బీజ మంత్రం జపించడం మంచిదిగా చెబుతారు.
55
మీన రాశి వారికి కష్టాలు
శుక్రుడు పదో స్థానంలో గోచారం చేయడం వల్ల కెరీర్ విషయంలో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విజయం కోసం ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు, పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. ఓర్పుతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి.
గమనిక: ఇవి జ్యోతిష్య అంచనాల ఆధారంగా ఇచ్చిన సమాచారం మాత్రమే. వ్యక్తిగత జాతకంపై ఫలితాలు మారవచ్చు. అలాగే ఇక్కడ పేర్కొన్న అంశాలను పలువురు పండితులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.