Zodiac Signs: ఈ 4 రాశులవారిపై శని దేవుడికి ప్రేమ ఎక్కువ.. కష్టాలు వీరి దరిదాపుల్లోకి కూడా రావు!

Published : Dec 20, 2025, 12:52 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు న్యాయానికి, కర్మ సిద్ధాంతానికి ప్రతీక. శని నిజాయతీగా జీవించే వారికి గొప్ప ఫలితాలను ప్రసాదిస్తాడు. ముఖ్యంగా కొన్ని రాశులపై శని దేవుడి అనుగ్రహం ఎక్కువ. శని ఆశీర్వాదం వల్ల వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.  

PREV
15
శని దేవుడికి ఇష్టమైన రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని భగవానుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. ఈ రాశుల వారు శని చెడు దృష్టికి ఎప్పుడూ లోనుకారు. ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని సమయంలో కూడా వీరిపై శని దయ చూపిస్తాడు. శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులతో ఈ రాశులవారి జీవితంలో సంతోషం నెలకొంటుంది. మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా…

25
మకర రాశి

మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారు స్వభావరీత్యా కష్టపడి పనిచేసేవాళ్లు, వారి లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఈ రాశిలో పుట్టిన వారు ఏలినాటి శని ప్రభావానికి తక్కువగా గురవుతారు. శని వారి వృత్తి, వ్యాపారంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఈ రాశివారు కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.

35
కుంభ రాశి

కుంభ రాశికి అధిపతి శని. కుంభ రాశి వారు సామాజిక సేవలో ఆసక్తి కలిగి ఉంటారు. దానాలు ఎక్కువగా చేస్తుంటారు. వీరికి ఎల్లప్పుడూ శని ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల ఈ రాశివారికి సమాజంలో గౌరవం, గుర్తింపు, హోదా దక్కుతాయి. వీరు ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషంగా జీవిస్తారు. శని దయతో కష్టాలు వీరి దరిదాపుల్లోకి కూడా రావు.

45
తుల రాశి

తుల రాశిలో శని ఉచ్ఛస్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ రాశివారికి శని దేవుడు న్యాయం, సమతుల్యత, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. శని ఆశీర్వాదంతో తుల రాశి వారికి జీవితంలో సంపద, శ్రేయస్సు, సుఖాలకు లోటు ఉండదు. కష్టమైన పరిస్థితులను కూడా వీరు సులభంగా ఎదుర్కొంటారు. వీరి నిజాయతీ అన్ని వేళల వీరికి రక్షణగా ఉంటుంది.

55
వృషభ రాశి

శని దేవుడికి ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటి. శని ఆశీస్సులతో ఈ రాశివారు సహనం, పట్టుదలతో పనిచేస్తారు. వీరి ఆర్థిక స్థితి క్రమంగా బలపడుతుంది. వీరి జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి వారిపై ఎలాంటి ప్రభావం చూపించవు. నిజాయతీ, శ్రమ, సహనం, క్రమశిక్షణ వంటి గుణాలు ఉన్నవీరిని శని దేవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories