Zodiac sign: కొత్తేడాదిలో అంతా మంచి జరగాలని కోరుకుంటారు. అయితే ఇందుకు జాతకం కూడా కలిసి రావాలని భావించే వారు మనలో చాలా మందే ఉంటారు. మరి ఈ ఏడాది కుంభ రాశి వారికి ఎలా ఉండనుంది.? ఎలాంటి మార్పులు జరగనున్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.
2026 సంవత్సరం ఆరంభంలో కుంభ రాశి వారికి మానసిక ఒత్తిడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించే స్వభావం కనిపించవచ్చు. ఈ సమయంలో స్వీయ నియంత్రణ చాలా అవసరం. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించి వేరే ప్రాంతానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి.
25
జనవరి–ఏప్రిల్: ఆదాయం పెరుగుతుంది, బాధ్యతలు కూడా ఎక్కువే
జనవరి మధ్య తర్వాత జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. అదే సమయంలో ఖర్చులు పెరిగినా, ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఏప్రిల్ చివరి నాటికి పదోన్నతులు, గౌరవం పెరగవచ్చు. ఈ దశలో ఆస్తి సంబంధిత లాభాలు, వాహన కొనుగోలు యోగం కూడా బలంగా కనిపిస్తోంది.
35
మే–జూన్: విద్య, వ్యాపార రంగాల్లో శుభఫలితాలు
మే చివరి నుంచి విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చదువు, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. పిల్లల నుంచి ఆనందకరమైన వార్తలు వినే సూచనలు ఉన్నాయి. జూన్ మధ్య తర్వాత ఆస్తి విలువ పెరగవచ్చు. కుటుంబ పెద్దల మద్ధతు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల వాతావరణం నెలకొంటుంది.
ఆగస్టు తర్వాత పని ఒత్తిడి పెరిగినా, ఫలితం మాత్రం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి, కానీ వాటితో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది. నవంబర్ తర్వాత మేథోపరమైన పనుల్లో బిజీగా ఉంటారు. రాయడం, బోధన, సృజనాత్మక రంగాల్లో లాభాలు కనిపిస్తాయి.
55
డిసెంబర్‌లో కీలక మార్పలు, పాటించాల్సిన నియమాలు
డిసెంబర్ ప్రారంభంలో ఉద్యోగంలో స్థలం మారే సూచనలు ఉన్నాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక ప్రణాళిక అవసరం. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. ఆధ్యాత్మికత వైపు దృష్టి పెడితే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
శుభఫలితాల కోసం సూచనలు:
* శనివారం సాయంత్రం రావి చెట్టు వద్ద నల్ల నువ్వులు సమర్పించాలి.