Birth Date: న్యూమరాలజీ ప్రకారం 2026లో ఏ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉండనుంది

Published : Jan 01, 2026, 06:46 AM IST

Birth Date: మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ కొత్త సంవత్సరంలో మీరు పుట్టిన తేదీ ప్రకారం ఈ సంవత్సరమంతా ఎలా గడుస్తుందో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఈ ఫలితాలను చదివేయండి…

PREV
19
నెంబర్ 1

సంఖ్య 1 (1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు): ఈ ఏడాది మీకు అత్యంత అదృష్టవంతమైన కాలం. సూర్యుడి ప్రభావం వల్ల నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

29
నెంబర్ 2

సంఖ్య 2 (2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు): మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చంద్రుడు, సూర్యుడి కలయిక వల్ల భాగస్వామ్య పనులు సఫలమవుతాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం అవసరం. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు దక్కుతుంది. కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు.

39
నెంబర్ 3

సంఖ్య 3 (3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు): జ్ఞానం, సంపద పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా నిలకడ ఉంటుంది. గురువులు లేదా పెద్దల సలహాలు మీకు మార్గదర్శకంగా మారుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు.

49
నెంబర్ 4

సంఖ్య 4 (4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు): కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. అకస్మాత్తుగా ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. సాంకేతిక రంగం వారికి విదేశీ అవకాశాలు వస్తాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు విజయం మీదే. క్రమశిక్షణ పాటించడం వల్ల మేలు జరుగుతుంది.

59
నెంబర్ 5

సంఖ్య 5 (5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు): వ్యాపార విస్తరణకు అద్భుతమైన ఏడాది. మీ మాట తీరు నలుగురిని ఆకట్టుకుంటుంది. కమ్యూనికేషన్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. బుద్ధి బలం పెరుగుతుంది.

69
నెంబర్ 6

సంఖ్య 6 (6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు): విలాసవంతమైన జీవితం గడుపుతారు. వాహనం లేదా కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. కళాకారులకు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

79
నెంబర్ 7

సంఖ్య 7 (7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు): పరిశోధనలు చేసే వారికి గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. అనవసర ఆలోచనలు తగ్గించుకోవడం మంచిది. ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. విదేశీ ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

89
నెంబర్ 8

సంఖ్య 8 (8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు): శని ప్రభావం వల్ల పనులు నెమ్మదిగా సాగుతాయి. ఓర్పు వహించడం ముఖ్యం. న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి లావాదేవీలు కలిసి వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఏడాది చివరలో అందుతుంది.

99
నెంబర్ 9

సంఖ్య 9 (9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు): అత్యంత ఉత్సాహంగా ఉంటారు. ధైర్యంతో చేసే పనులు సఫలమవుతాయి. రియల్ ఎస్టేట్, పోలీస్ రంగాల వారికి పదోన్నతులు లభిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories