Mars Transit: కుజ సంచారంతో ఈ 4 రాశులవారికి 45 రోజుల పాటు తిరుగులేదు, డబ్బు చేతికందుతుంది

Published : May 12, 2026, 07:13 AM IST

Mars Transit: గ్రహాలకు సేనాధిపతిగా కుజుడుని చెప్పుకుంటారు. కుజుడు మే11న మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి 45 రోజుల పాటూ సంపద, శ్రేయస్సును తీసుకురాబోతోంది. ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకోండి.

PREV
14
మేషం

మేష రాశికి అధిపతి కుజుడు. సొంత రాశిలోకే కుజుడు వస్తున్నాడు కాబట్టి రాబోయే 45 రోజులు ఈ రాశి వారికి స్వర్ణకాలమనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. ఈ కాలంలో వీరికి ఆర్థిక స్థిరత్వం వస్తుంది. విజయం దక్కే అవకాశం ఉంది. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు దాదాపు పూర్తయిపోతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. కొత్త బాధ్యతలు కూడా చేపడతారు. భూమి, ఆస్తికి సంబంధించిన వివాదాలు ఒక ముగింపకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చు.

24
కర్కాటకం

కర్కాటక రాశి వారికి కుజుడి సంచారం అనేక విధాలుగా కలిసివస్తుంది. మొన్నటివరకు ఎంత కష్టపడినా ఫలితం దక్క లేదని బాధపడేవారికి ఇప్పుడు మంచి రోజులు మొదలవుతాయి. ఈ రాశి వారి శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. సహోద్యోగుల నుంచి సపోర్టు లభిస్తుంది.  ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పోటీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆస్తులు కొనడం, పెట్టుబడులు పెట్టడం ఈ కాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి.

34
సింహం

కుజుడి సంచారం సింహ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారి ఎదుగుదలకు ఇదే అనువైన సమయం. సమాజంలో వీరి గౌరవం, హోదా పెరుగుతాయి. వీరు ఆర్థికంగా గొప్ప పురోగతిని చూస్తారు. ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. స్నేహితులు, అన్నయ్యల నుంచి సహాయం లభిస్తుంది. సమాజంలో ఈ రాశి వారి స్థాయి పెరుగుతుంది. వీరి చిరకాల కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి.

44
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కుజుడి సంచారం ఎన్నో రకాలుగా లాభాలను తెచ్చిపెడుతుంది. వీరికి ఆర్థిక లాభాలతో పాటూ కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రాశివారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు రావడం మొదలవుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయమని చెప్పుకోవాలి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి దూర ప్రయాణాల ద్వారా లాభాలు కనిపిస్తున్నాయి.  తండ్రి వైపు బంధువుల ద్వారా ఆర్థిక లాభాలు కలగవచ్చు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శత్రువులను జయించే శక్తి వస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories