Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధుమిత్రుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి!

Published : May 12, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 12.05.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆత్మీయుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

713
కన్య రాశి ఫలాలు

దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

813
తుల రాశి ఫలాలు

పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు

ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూలం.

1213
కుంభ రాశి ఫలాలు

కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories