Birth Date: జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రాల ప్రకారం మనిషి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వం, అదృష్టం, భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కొన్ని తేదీల్లో జన్మించినవారు సహజంగా అదృష్టాన్ని ఆకర్షిస్తారట. చాలా త్వరగా ధనవంతులు అవుతారట. మరి ఆ తేదీలేంటో చూద్దామా..
మనిషి జీవితంపై పుట్టిన తేదీ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం చెబుతోంది. వ్యక్తి పుట్టిన రోజు, తేదీ, సమయం ఆధారంగా వారి స్వభావం, అదృష్టం, ఆర్థిక స్థితి, భవిష్యత్తు వంటి అంశాలను అంచనా వేయవచ్చని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టినవారు సహజంగానే అదృష్టాన్ని ఆకర్షిస్తారట. వీరు జీవితంలో చాలా త్వరగా కోటీశ్వరులవుతారట. మరి ఆ తేదీలేంటో చూసేయండి.
25
1, 10, 19, 18 తేదీల్లో పుట్టినవారు
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారిపై సూర్య గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలు సహజంగా కనిపిస్తాయి. ఏ పని చేసినా ముందుండి నడిపించాలనే తత్వం ఉంటుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు, పేరు ప్రతిష్ఠలను సంపాదించే అవకాశం వీరికి ఎక్కువ. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయ రంగాల్లో వీరు చాలా త్వరగా ఎదుగుతారు.
35
3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవారు
అలాగే ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవారిపై గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు తెలివితేటలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, మంచి నిర్ణయ సామర్థ్యంతో ముందుకు సాగుతారు. కుటుంబానికి గౌరవం తీసుకురావడమే కాకుండా సమాజంలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందుతారు. డబ్బు విషయంలో కూడా వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది.
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు బుధ గ్రహ ప్రభావంలో ఉంటారు. వీరు చురుకుదనం, మాటతీరు, వ్యాపార నైపుణ్యం వల్ల జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారు. కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వీరు ముందుంటారు. సోషల్ మీడియా, వ్యాపారం, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో వీరు మంచి స్థాయికి చేరుకుంటారు.
55
7, 16, 25 తేదీల్లో పుట్టినవారు
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులు. వీరికి ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. జీవితంలో వీరు చాలా త్వరగా గొప్ప స్థాయికి చేరుకుంటారు. మొదట్లో కాస్త కష్టాలు ఎదురైనా తర్వాత కాలంలో మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ యోగం, మంచి ఉద్యోగం, అనుకోని ధనలాభాలు వీరికి దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.