రాహువును చెడు గ్రహంగా భావిస్తారు. కానీ రాహువు కూడా మంచి స్థానంలో ఉంటే కొన్ని రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలను, సంతోషాన్ని అందిస్తుంది. రాహువు డిసెంబర్ 2, 2025, మంగళవారం తెల్లవారుజామున 2:11 గంటలకు శతభిషా నక్షత్రంలోని నాలుగో పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం రాహువు పూర్వాభాద్ర మొదటి పాదంలో ఉన్నాడు. ఈ రాహు సంచారం కొన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రాహువు శతభిషా నక్షత్రం నాలుగో పాదంలోకి రాగానే, 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వారి పనులన్నీ విజయవంతం అవుతాయి.