బుధుడి వక్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి 20 రోజుల వరకు చుక్కలే!

Published : Nov 10, 2025, 12:27 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సమయానుసారం గ్రహాలు.. రాశులు మారుస్తుంటాయి. నేడు(నవంబర్ 10న) బుధుడు వక్ర స్థితిలో సంచరించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు రానున్నాయి. మరి ఆ రాశులేంటో వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ చూద్దాం.

PREV
15
బుధుడి వక్ర సంచారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తెలివి, మాట, చదువు, కమ్యూనికేషన్, వ్యాపారం, ఒప్పందాలు, ప్రయాణాలకు కారకుడు. నవంబర్ 10న బుధుడు వృశ్చిక రాశిలో వక్ర గమనాన్ని ప్రారంభిస్తాడు. ఇది నవంబర్ 30 వరకు ఉంటుంది. బుధుడి ఈ సంచారం కొన్ని రాశుల వారికి మేలు చేకూర్చినా, మరికొన్ని రాశుల వారికి సవాళ్లు లేదా ప్రతికూల ఫలితాలు తీసుకురానుంది. మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా..

25
మేష రాశి

బుధుడి వక్ర సంచారం మేష రాశి 8వ ఇంట్లో జరగనుంది. 8వ ఇల్లు రహస్యాలు, ఆయుష్షు, ఆకస్మిక సంఘటనలు, ఆర్థిక విషయాలను సూచిస్తుంది. కాబట్టి మేష రాశి వారు ఊహించని ఆర్థిక సమస్యలు లేదా అప్పుల్లో చిక్కుకోవచ్చు. పెట్టుబడులు లేదా భాగస్వాములతో డబ్బు విషయాల్లో గందరగోళం ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ, చర్మం లేదా నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. అనవసర వాదనలు, అభిప్రాయ భేదాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది.

35
వృషభ రాశి

బుధుడి వక్ర సంచారం వృషభ రాశి 7వ ఇంట్లో జరిగే అవకాశం ఉంది. ఇది సంబంధాలు, వివాహం, భాగస్వామ్యం, ప్రజా జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వృషభ రాశి వారికి వైవాహిక జీవితం లేదా ప్రేమ సంబంధాల్లో ఇబ్బందులు రావచ్చు. తీరిపోయాయి అనుకున్న సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. కాబట్టి సంబంధాల్లో సర్దుకుపోవడం అవసరం. వ్యాపారంలో భాగస్వాములతో ఒప్పందాలు లేదా డబ్బు లావాదేవీల్లో సందేహాలు, అపార్థాలు తలెత్తవచ్చు. కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండడం మంచిది. పనిభారం వల్ల మానసిక ఒత్తిడి లేదా శారీరక అలసట కలగవచ్చు.

45
సింహ రాశి

బుధుడి వక్ర సంచారం సింహ రాశి 4వ ఇంట్లో జరిగే అవకాశం ఉంది. ఇది ఇల్లు, వాహనం, తల్లి, మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. బుధుడి వక్ర సంచారం వల్ల కుటుంబం లేదా తల్లి ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు రావచ్చు. దానివల్ల ప్రశాంతత లోపిస్తుంది. ఇల్లు, స్థలం లేదా వాహనం కొనడం, అమ్మడం లాంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని పత్రాల్లో గందరగోళం ఏర్పడవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండాలి.

55
తుల రాశి

బుధుడి వక్ర సంచారం తుల రాశి 2వ ఇంట్లో జరగనుంది. ఇది సంపద, కుటుంబం, వాక్చాతుర్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ సమయంలో తుల రాశి వారి మాటల్లో కఠినత్వం, అపార్థాలు చోటుచేసుకోవచ్చు. అనవసర మాటల వల్ల కుటుంబంలో, బయట సమస్యలు రావచ్చు. ఆదాయం సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. పొదుపు తగ్గవచ్చు. లేదా ఊహించని వృథా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు లేదా దంపతుల మధ్య చిన్న గొడవలు, మనస్పర్థలు రావచ్చు. కాబట్టి ఓపికతో వ్యవహరించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories