Birth Month: ఈ నెలలో పుట్టిన వారు బ్రహ్మం గారి వారసులు... భవిష్యత్తు ముందే తెలిసిపోతుంది...!

Published : Nov 10, 2025, 10:44 AM IST

Birth Month:  న్యూమరాలజీ ప్రకారం కొన్ని నెలలో పుట్టిన వారికి సహజంగానే ఒక అంతర్ దృష్టి ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయం వారికి ముందుగానే తెలిసిపోతుంది. 

PREV
15
Birth Month

జోతిష్యశాస్త్రంలో ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా, పుట్టిన తేదీ, నెల ఆధారంగా కూడా వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని ప్రత్యేక నెలల్లో జన్మించిన వారికి సహజంగానే ఓ అంతర్ దృష్టి ఉంటుంది. ఈ అసాధారణ శక్తి కారణంగా వీరికి భవిష్యత్తును అంచనా వేయగల సామర్థ్యం లభిస్తుంది. భవిష్యత్తును 100 శాతం అంచనా వేయలేరు కానీ... వీరు కొంత వరకు ఊహించగలరు. మరి, ఈ నెలలో జన్మించిన వారిలో ఈ స్పెషల్ పవర్ ఉంటుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....

25
డిసెంబర్....

డిసెంబర్ లో జన్మించిన వ్యక్తులు వారు వినూత్నంగా ఆలోచిస్తారు. వీరికి ముందు చూపు కూడా చాలా ఎక్కువ. ఇతరులు గమనించని విషయాలను గమనించే ప్రత్యేక సామర్థ్యం వీరికి ఉంటుంది. ఇది వారికి భవిష్యత్తు పరిణామాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. వీరికి దూర దృష్టి చాలా ఎక్కువ. సామాజికంగా జరిగే మార్పులను, ఆవిష్కరణల గురించి చాలా బాగా అంచనా వేయగలరు. వీరు చెప్పింది దాదాపు నిజం అవుతుంది.

35
జులై..

జులైలో జన్మించిన వ్యక్తులకు కూడా అసాధారణమైన అంతర్ దృష్టి ఉంటుంది. ఇది భవిష్యత్తను అంచనా వేయడంలో వీరికి సహాయపడుతుంది. వారు తమ చుట్టూ ఉన్నవారి భావోద్వేగ, మానసిక స్థితికి బాగా అనుగుణంగా ఉంటారు. ఇది ఇతరులు ఊహించలేని మార్పులను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. పిల్లల భవిష్యత్తు, కుటుంబ సంబంధాలు, సామాజిక మార్పులను వీరు చాలా బాగా అర్థం చేసుకోగలరు. భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే విషయం వీరికి చాలా బాగా అర్థమౌతుంది. దానికి తగినట్లే వీరు అడుగులు వేస్తూ ఉంటారు.

45
ఫిబ్రవరి...

ఫిబ్రవరిలో జన్మించిన వ్యక్తులు వారి అంతర్గత ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు. బలమైన అంతర్ దృష్టిని కలిగి ఉంటారు. ఎవరూ అర్థం చేసుకోలని చిన్న చిన్న విషయాలను కూడా వీరు బాగా అర్థం చేసుకోగలరు. ప్రతి చిన్న విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తు అంచనాలు వీరికి కలలో వస్తూ ఉంటాయి.. వారి చుట్టూ ఉన్న వ్యక్తుల భావోద్వేగాలను సులభంగా గ్రహించే వారి సామర్థ్యం కూడా పరిస్థితి ఎలా మారుతుందో అంచనా వేయడంలో వారికి సహాయపడుతుంది. ఇది వారి చుట్టూ ఉన్నవారిని ఆశ్చర్యపరుస్తుంది. వారి అంతర్ దృష్టి వారి ఏడవ ఇంద్రియానికి సమానం. ఇది వారికి ఏమి జరగబోతోందో అది జరగడానికి ముందే గ్రహించే అవకాశాలను ఇస్తుంది.

55
.అక్టోబర్....

అక్టోబర్....అక్టోబర్ లో జన్మించిన వ్యక్తులు బలమైన అంతర్ దృష్టిని కలిగి ఉంటారు. వారు రహస్యాలను కొనుగొనడంలో దాగి ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో వీరు నిష్ణాతులు అని చెప్పొచ్చు. వీరు జీవితంలో చాలా చురుకుగా ఉంటారు. తమ గురించి మాత్రమే కాదు.. పక్క వారి జీవితంలో ఏం జరుగుతుందో వీరికి ముందే తెలిసిపోతుంది. వీరికి అన్నీ ముందే తెలిసిపోతున్నాయని.. పక్కవారంతా చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories