Gajakesari Yogam: గజకేసరి యోగంతో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, విజయం

Published : Oct 28, 2025, 07:45 AM IST

Gajakesari Yogam: గజకేసరి యోగం వల్ల ఓ రాశి వారికి విపరీతంగా కలిసిరాబోతోంది.  బృహస్పతి చంద్రుల కలయిక వల్ల అక్టోబర్ చివరి మూడు రోజులు ఓ రాశి వారికి ఆదాయం, ఉద్యోగం, ఆరోగ్యం అన్ని విషయాల్లో శుభఫలితాలు కలగబోతున్నాయి. 

PREV
16
మేష రాశి

గజకేసరి యోగం మేష రాశి వారికి విశేషంగా కలిసివస్తుంది.  గురు, చంద్రుల దృష్టి ఈ రాశి వారికి విశేష ఫలితాలను అందిస్తుంది.  వీరి నెలవారీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువ. ఆస్తిపరంగా తీసుకునే నిర్ణయాలు తీసుకునేందుకు  ఇది ఎంతో అనుకూల సమయమనే చెప్పుకోవాలి. ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. నిరుద్యోగులకు విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా రావచ్చు.

26
కర్కాటక రాశి

కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛస్థితిలో ఉంటాడు.  ఇక ఈ రాశి వారి ఏడవ ఇంట్లో చంద్రుని దృష్టి ఉంటుంది. కాబట్టి జీవితంలో వీరికి శుభ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు, రోగాలు, అప్పుల సమస్యలు తీరి మంచి విజయాన్ని సాధిస్తారు. ఆదాయం చాలా వరకు పెరుగుతుంది.

36
కన్యా రాశి

గజకేసరి యోగం కన్యారాశి వారికి శుభఫలితాలను అందిస్తుంది. వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వచేే ఉద్యోగం, వృత్తిలో లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆస్తుల విలువ అమాంతం పెరుగుతుంది.

46
తులా రాశి

తులా రాశి వారి పదవ ఇంట్లో గురు, చంద్రుల పరస్పర దృష్టి వల్ల పూర్తి గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల తులా రాశి వారికి ఆదాయం అధికంగా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు కలిగే ఛాన్స్ కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి.  ఆరోగ్యపరంగా అన్ని సమస్యలు తీరుతాయి.

56
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడింది. ఇది వీరికి ఊహించని ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లోె ఉద్యోగావకాశాలు వస్తాయి.   ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీతం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వస్తుంది.

66
మకర రాశి

మకర రాశి వారికి చంద్రుడు, ఏడవ ఇంట్లో గురువు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల గజకేసరి యోగం పూర్తిగా ఏర్పడుతుంది. దీనివల్ల ఉద్యోగం, వ్యాపారాల్లో సంపాదన పెరుగుదల ఉంటుంది. శత్రువుల బాధలు తగ్గుతారు.  వ్యాధులు, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఇల్లు, వాహనాలు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories