
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. బంధువర్గం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు తప్పవు. ఆస్తి వివాదాలు మానసిక చికాకును కలిగిస్తాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. పనులలో జాప్యం కలుగుతుంది.
వ్యాపారాల్లో ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువర్గంతో వివాదాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. విందు వినోదాలకు డబ్బు ఖర్చు చేస్తారు.
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయటం మంచిది. దైవచింతన పెరుగుతుంది.
చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో అకారణంగా మాటపట్టింపులు వస్తాయి.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.