
జోతిష్య శాస్త్రంలో గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో ఒక్కో రాశిని మార్చుకుంటూ ఉంటుంది. అలా రాశిని మారినప్పుడల్లా.. 12 రాశులపై దాని ప్రభావం ఉంటుంది. డిసెంబర్ లో బుధ గ్రహం రెండు సార్లు రాశిని మార్చుకోనుంది. బుధుడు.. డిసెంబర్ 8 నుంచి వృశ్చిక రాశిలో ఉండి, డిసెంబర్ 30 న ధనస్సు రాశిలోకి అడుగుపెడతాడు. దీని కారణంగా ఏ రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం....
బుధ సంచారం మేష రాశి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృశ్చిక రాశి, ధనస్సు రాశి రెండు రాశుల్లోకి అడుగుపెట్టడం మేష రాశివారికి అదృష్టాన్ని పెంచుతుంది. బుధ సంచారం ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది. కుటుంబంలో ఆనందం పెంచుతుంది. లాభాలు పెరుగుతాయి. ధన ప్రవాహం పెరగడం వల్ల అప్పులు తీరుతాయి.
బుధ సంచారం వృషభ రాశివారికి కూడా చాలా మేలు చేయనుంది. మరీ ముఖ్యంగా ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. కానీ, శ్రతువుల భయం మాత్రం పెరుగుతుంది. ఆ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీరు చేసిన అప్పులను ఇప్పుడు తీర్చగలుగుతారు. కానీ, వేరే వాళ్లకు మీరు డబ్బు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ఆ డబ్బు మళ్లీ మీ చేతికి వస్తుందా లేదా అనే విషయం ఆలోచించుకోవాలి. ఆ సంగతి పక్కన పెడితే.. మిగిలిన సమయం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరతాయి.
మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి, ఈ సంచారము మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని తెస్తాయి. కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సమాజంలో మీ గౌరవం , ప్రతిష్ట పెరుగుతుంది. డిసెంబర్ 8న వృశ్చిక రాశిలోకి వెళ్ళే బుధుడు, మిథున రాశి 6వ ఇంట్లో ఉంటాడు. డిసెంబర్ 30న ధనుస్సు రాశిలోకి వెళ్ళే బుధుడు, మిథున రాశి 7వ ఇంట్లోకి వెళతాడు. బుధుడు ఈ స్థితిలో ఉండటం వలన మిథున రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీ అప్పులు తీరుతాయి. మీరు ఇతరులకు డబ్బు ఇవ్వగలిగే స్థాయికి ఎదుగుతారు. మీ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది.
డిసెంబర్ 8 న కర్కాటక రాశి 5వ ఇంట్లో వృశ్చిక రాశిలోకి బుధుడు ప్రవేశిస్తే, డిసెంబర్ 30న ధనుస్సు రాశిలోకి వెళ్ళే బుధుడు, కర్కాటక రాశి 6వ ఇంట్లో ఉంటాడు. మీ జాతకంలో 5వ, 6వ ఇళ్లలో ఉన్న బుధుడు చాలా శుభ ఫలితాలను ఇస్తాడు. మీకు డబ్బు కోసం అవకాశాలు తిరిగి వస్తాయి. మీ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. గతంలో తీసుకున్న రుణాలు తీరుతాయి. వివాహంలో ఆనందం, శాంతి , ప్రశాంతత నెలకొంటాయి. కెరీర్ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
డిసెంబర్ 8 న బుధుడు సింహరాశిలోని 4వ ఇంట్లో సంచరిస్తాడు. అలాగే, డిసెంబర్ 30న బుధుడు 5వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ బుధ సంచారము సింహరాశి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఇంటర్వ్యూలు , పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన అప్పులు మీరు తీరుస్తారు. మీ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది.
కన్యరాశిలోని 3వ , 4వ ఇళ్లలో బుధ సంచారము మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో, కన్య రాశి వారు పనిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మీరు గతంలో చేసిన అప్పులను తీరుస్తారు. ఆఫీసులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు అందుకుంటారు.
డిసెంబర్ 8 న బుధుడు తులారాశిలోని 2వ ఇంట్లోకి సంచరిస్తాడు. డిసెంబర్ 30న బుధుడు తులారాశిలో 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది తులారాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. బుధుడు ఈ స్థితిలో ఉండటం వలన ఉద్యోగార్థులకు ఆశించిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి. కానీ జాగ్రత్తగా ఉండండి, శత్రువుల వల్ల ఇబ్బందులు పడతారు.
వృశ్చికరాశివారు బుధుని పూర్తి ఆశీస్సుల వల్ల బలాన్ని పొందుతారు. బుధుని అనుగ్రహం వల్ల అన్ని సౌకర్యాలు లభిస్తాయి. బుధ సంచారము వృశ్చికరాశి వారికి ఊహించని అదృష్టాన్ని తెస్తుంది. ప్రయాణాల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మీరు దాని నుండి మంచి లాభాలను ఆశించవచ్చు. మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది. మీరు మీ కెరీర్‌లో గొప్ప విజయాన్ని చూస్తారు. మీ పనిని మీ ఉన్నతాధికారులు అభినందించడమే కాకుండా పదోన్నతికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి వారు బుధుడు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఇంటర్వ్యూలు , పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది శుభ సమయం. మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు. పనిలో , వివాహ జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇది అనుకూలమైన సమయం. చాలా సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
బుధుడు మకర రాశి 11 , 12వ ఇళ్లలో సంచరిస్తాడు. బుధుడు ఈ స్థితిలో ఉండటం వల్ల మంచి ఫలితాలు రావు. ఈ సమయంలో మీ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం దొరకడం మీకు కష్టంగా ఉండవచ్చు. వివాహంలో విభేదాలు పెరుగుతాయి. గతంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. మీరు పనిలో విశ్వాసం , ఉత్సాహాన్ని కోల్పోవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
బుధుడు నుండి అన్ని సౌకర్యాలను పొందుతారు. డిసెంబర్ 8న వృశ్చిక రాశిలో సంచరించే బుధుడు, కుంభ రాశి 10వ ఇంట్లో ఉంటాడు. డిసెంబర్ 30న ధనుస్సు రాశిలో సంచరించే బుధుడు, కుంభ రాశి 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో కుంభ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. పెద్దగా కష్టపడకపోయినా డబ్బు ఈజీగా సంపాదించగలరు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
డిసెంబర్ 8న వృశ్చిక రాశిలో సంచరించే బుధుడు, మీన రాశి 9వ ఇంట్లో ఉంటాడు. డిసెంబర్ 30న ధనుస్సు రాశిలో సంచరించే బుధుడు, 10వ ఇంట్లో మీన రాశి వారికి సంచరిస్తాడు. బుధుని ఈ స్థానం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక జీవితం సంపన్నంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. మీరు చిన్న ప్రయత్నంతో భారీ లాభాలను పొందుతారు. ఈ సమయంలో అంచనాలకు మించిన లాభాలు మీకు చేరుతాయి. గతంలో మీరు చేసిన అప్పులన్నింటినీ మీరు తీరుస్తారు.