Birth Stars: జన్మ సమయానికి చంద్రుడు ఉన్న నక్షత్రం మన ఆలోచనా విధానాన్ని, లక్ష్యాలను, శ్రమను, ధన సాధన శక్తిని నిర్ణయించడంలో ప్రభావం చూపుతుంది. కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి ఆర్థికంగా చాలా బాగా కలిసొస్తుంది. ఆ నక్షత్రాలేంటో చూద్దాం
ఈ నక్షత్రంలో పుట్టిన వారు చాలా ఈజీగా డబ్బు సంపాదించగలరు. వీరికి సహజంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అంతేకాదు... వీరు ప్రతి విషయంలోనూ చాలా కష్టపడతారు. ఆ హార్డ్ వర్క్ కి వారి తెలివితేటలు కూడా తోడు అయితే వీరు జీవితంలో బాగా స్థిరపడతారు. ముఖ్యంగా వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్స్ లో పెద్ద విజయం సాధించగలరు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు.
25
రోహిణీ నక్షత్రం....
రోహిణీ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు సహజంగా లక్ష్య సాధన ఎక్కువ. వీరికి డబ్బు ఎలా సంపాదించాలి అనే ప్లానింగ్ ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా దానికి పెద్ద స్థాయికి తీసుకువెళ్లే శక్తి వీరికి ఉంటుంది. వ్యవసాయం, వ్యాపారం, మీడియా రంగాల్లో వీరు ఎక్కువ డబ్బు సంపాదించగలరు. ఈ నక్షత్రానికి చంద్రుడు అధిపతి. ఇదే, వీరి జీవితంలో వెలుగులు నింపుతుంది.
35
శ్రవణ నక్షత్రం....
శ్రవణా నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు స్ట్రాటజిక్ మైండ్ కలిగి ఉంటారు. దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, విద్య, బ్యూరోక్రసీ వంటి రంగాలను ఎంచుకుంటే గొప్ప స్థాయికి వెళతారు. డబ్బు ఎక్కువగా సంపాదించుకుంటారు.
ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు ఆర్థికంగా ఎదగడానికి మంచి కర్మ ఫలం కలిగి ఉంటారు. ఫిల్మ్, క్రియేటివ్, బిజినెస్, హోటల్, డిజైన్ రంగాల్లో పెద్ద రేంజ్ కి వెళ్తారు. సంపదతో పాటు... ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది. వీరు రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం వెనకాడరు. ఈ లక్ష్యం కారణంగానే మంచి స్థాయికి వెళ్లి... డబ్బు ఎక్కువగా సంపాదించగలరు.
5.పుష్య నక్షత్రం..
పుష్య నక్షత్రంలోని అబ్బాయిలు ఎంత చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టినా, చివరకు పెద్ద స్థాయిలో నిలుస్తారు. ధనం, స్థిరాస్తులు పెంచుకుంటారు. పుష్యా నక్షత్రాన్ని ధన నక్షత్రం అని చెబుతారు. ఈ నక్షత్రంలో పుట్టినవారు చాలా క్రమశిక్షణతో ఉంటారు. చాలా శ్రద్ధగా ఉంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. ఫలితంగా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు.
55
ఉత్తరాషాడ, ఉత్తరభాద్ర నక్షత్రాలు..
ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు 30 ఏళ్లు దాటకముందే మంచి స్థాయికి వెళతారు. జీవితంలో వీరు స్థిరాస్తులు సంపాదించుకుంటారు. పెద్ద వ్యాపారాలు చేస్తారు. ఎక్కువ డబ్బు సంపాదించగలరు. సహజంగానే వీరు డబ్బును ఆకర్షించగలరు.