వృషభరాశి రాశి వారు అత్యంత పట్టుదలతో ఉండే వ్యక్తులు. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని మార్చడం చాలా చాలా కష్టం. వీరి మొండితనానికి ప్రసిద్ధి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త సలహాలు.. మొదట్లో వీరికి అస్సలు నచ్చవు. ఎందుకంటే తాము తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని వీరు గట్టిగా నమ్ముతారు. అందుకే వీరు ఇతరుల మాటలకు చాలా తక్కువ ప్రాధాన్యం ఇస్తారు.