Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో అయస్కాంత శక్తి ఎక్కువ, వీళ్లే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్

Published : Jan 23, 2026, 10:37 AM IST

Birth Date: న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీని ఆధారం చేసుకొని మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో అయస్కాంత శక్తి ఉంటుంది. దానితో అందరినీ ఆకర్షించేస్తారు. ఆ తేదీలేంటో చూద్దాం.. 

PREV
14
నంబర్ 6( సౌందర్యానికి మారుపేరు)

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి శుక్రుడు అధిపతి. శుక్రుడు అందం, విలాసం, ఆకర్షణకు చిహ్నం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా, కళాత్మకంగా ఉంటారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్, నవ్వు ఎదుటి వారిని ఇట్టే కట్టిపడేస్తాయి. వీరిలో తెలియని ఆకర్షణ ఉంటుంది. అయస్కాంతం ఆకర్షించినట్లు గా ఆకర్షిస్తారు. వీరు ఎక్కడికి వెళ్లినా చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరిలో సహజమైన ఒక హుందాతనం ఉంటుంది. అందుకే వీరిని మనీ అండ్ బ్యూటీ మాగ్నెట్స్ అని కూడా పిలవచ్చు.

24
నెంబర్ 1( రాజసానికి కేరాఫ్ అడ్రస్)..

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీలకు సూర్యుడు అధిపతి. సూర్యుడు అంటేనే వెలుగు, అధికారం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారు. వీరు ఎవరి కింద తల వంచడానికి కూడా ఇష్టపడరు. వీరి క్వీన్ లాంటి పర్సనాలిటీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆకట్టుకుంటుంది.వీరి గంభీరమైన చూపు, స్పష్టమైన మాటతీరుతో అందరికంటే ప్రత్యేకంగా కనపడతారు. వీరు ఎక్కడికి వెళ్లినా గౌరవం వాటంతట అదే వస్తుంది. తమ మాటతో అందరినీ ఆకర్షిస్తారు.

34
నెంబర్ 5 ( తెలివైన మాటకారులు)

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీలకు అధిపతి బుధుడు. బుధ గ్రహం తెలివితేటలు, కమ్యూనికేషన్ కి చిహ్నం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. వీరు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ, జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తారు.వీరిలో అందరినీ ఆకర్షించే విషయాలు చాలా ఉన్నాయి. వీరి చార్మింగ్ మాట తీరు వల్ల ఎవరైనా వీరితో మాట్లాడటానికి ఇష్టపడతారు. బోర్ కొట్టకుండా మాట్లాడటం వీరిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.

44
నెంబర్ 3 ( ఆకర్షణీయమైన చిరునవ్వు)..

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీలకు బృహస్పతి అధిపతి. గురువు అంటే జ్ఞానం, గౌరవం. ఈ తేదీల్లో పుట్టినవారి ప్రత్యేకత ఏమిటంటే.. ఈ అమ్మాయిలు చాలా జ్ఞానవంతులు.వీరి చిరునవ్వులో ఒక తెలియని ప్రశాంతత ఉంటుంది. వీరు కేవలం బాహ్య సౌందర్యంతోనే కాదు, తమ జ్ఞానంతో కూడా అందరినీ ఆకట్టుకుంటారు. వీరు ఇచ్చే సలహాలు, వీరి హుందాతనం అందరినీ ఆకర్షిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories