Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారు 3 విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!

Published : Mar 01, 2026, 07:00 AM IST

Weekly Horoscope: ఈ వార ఫలాలు 1.3.2026 నుంచి 7.3.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఈ వారం మేషరాశి వారికి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో వేగం కనిపిస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా స్థిరంగా ఉన్నా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు వస్తాయి. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.

313
వృషభ రాశి ఫలాలు

ఈ వారం వృషభరాశి వారికి సౌఖ్యం, సంతోషం కలుగుతాయి. కుటుంబంతో సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత అవసరం. కొన్ని ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

413
మిథున రాశి ఫలాలు

మిథునరాశి వారికి ఈ వారం ఉత్సాహంగా ఉంటారు. కమ్యూనికేషన్ నైపుణ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభదాయకం. ఆర్థికంగా కొత్త అవకాశాలు వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  కుటుంబం వాతావరణం సంతోషంగా ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

కర్కాటకరాశి వారికి ఈ వారం మానసిక స్థిరత్వం తగ్గవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.  కుటుంబ సభ్యులతో కలహా సూచనలు ఉన్నాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.

613
సింహ రాశి ఫలాలు

సింహరాశి వారికి ఈ వారం సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం మంచిది.

713
కన్య రాశి ఫలాలు

కన్య రాశి వారు ఈ వారం క్రమశిక్షణతో ఉంటారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

813
తుల రాశి ఫలాలు

తుల రాశి వారికి ఈ వారం సృజనాత్మకత పెరుగుతుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు.

913
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశి వారు ఈ వారం ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఆర్థికంగా ఊహించని లాభాలు వస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కోపం తగ్గించుకోవడం మంచిది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సురాశి వారికి ఈ వారం ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి.

1113
మకర రాశి ఫలాలు

మకరరాశి వారికి ఈ వారం శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ఉద్యోగంలో క్రమశిక్షణ పాటిస్తే ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని విషయాల్లో సహనం పాటించడం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు

కుంభరాశి వారికి ఈ వారం కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 

1313
మీన రాశి ఫలాలు

మీనరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారాలు కలిసివస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. 

Read more Photos on
click me!

Recommended Stories