Sun Jupiter Conjunction: గురు, శుక్రుల కలయికతో.. ఈ 5 రాశులవారికి పుష్కలంగా లక్ష్మీదేవి ఆశీస్సులు

Published : Mar 01, 2026, 06:44 AM IST

Sun Jupiter Conjunction: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కలయిక ఎంతో ముఖ్యం. ప్రస్తుతం గురు గ్రహం మీనరాశిలో ఉన్నాడు. మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కలయికతో 'గురు-ఆదిత్య యోగం' ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశులకు కలిసొస్తుంది. 

PREV
15
మేష రాశి

మేష రాశి వారికి ఈ గురు ఆదిత్య యోగం విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది.  ఈ సమయంలో ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  వీరికి సమాజంలో మంచి గౌరవం పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి  ఉన్నత ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నా విజయం మీదే. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

25
మిథున రాశి

మిథున రాశి వారికి కలిసొచ్చే కాలం రాబోతోంది.  గురు ఆదిత్య యోగం వల్ల వీరి కెరీర్‌ దూసుకెళ్లిపోతుంది. వ్యాపారాల్లో మంచి ఆర్థిక లాభాలు కనిపిస్తాయి.  ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారి తండ్రి లేదా పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి నిర్ణయాత్మక శక్తి బాగా పెరుగుతుంది.

35
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ గురు ఆదిత్య యోగం చాలా కలిసి వస్తుంది.  ఈ కలయిక ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చేసే దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు వేగంగా సాగుతాయి. అదృష్టం ఈ రాశి వారి వెంటే ఉంటుంది.

45
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే కాలం ఇది. ఈ యోగం వల్ల వారు శుభవార్తలు వింటారు.  పిల్లలకు, విద్యకు సంబంధించి గుడ్ న్యూస్ తెలస్తుంది. పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు పొందుతారు. కళలు, రచన లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్న వారి కీర్తి బాగా పెరుగుతుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి.

55
మీన రాశి

గురు ఆదిత్య యోగం మీన రాశిలోనే ఏర్పడుతుంది.  సొంత రాశిలోనే యోగం  ఏర్పడుతోంది కాబట్టి… ఈ రాశి వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. గురు ఆదిత్య యోగం  వల్ల ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత దక్కుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం  సాఫీగా సాగుతుంది. సమాజంలో నాయకుడిగా మీరు పేరు ఎదుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories