
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మంచి మాటతీరుతో ఇంటా బయటా అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘ కాలిక రుణాలు తీర్చాగలుగుతారు. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వారం చివరన స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
శత్రు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన విద్య ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి.
చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వారం మధ్యలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి. వారం ప్రారంభంలో సోదరులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాల గురించి చర్చిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యలో చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది.
కీలక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రుల వియోగం బాధిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగులకు అదనపు భాధ్యతలుంటాయి. వారాంతంలో నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
చిన్ననాటి మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దీర్ఘకాలిక వివాదాలలో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగుల కష్టం ఫలించి అవకాశాలు లభిస్తాయి. వారాంతంలో బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుంచి కొంత వరకు బయట పడతారు. కీలక వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆప్తులతో మాటపట్టింపులు తొలగుతాయి. వారం ప్రారంభంలో డబ్బు పరంగా ఇబ్బందులుంటాయి.
ముఖ్యమైన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి లాభాల అందుకుంటారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వారాంతంలో బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి.
వారం ప్రారంభంలో విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. బంధువర్గం నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానం విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రారంభించిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో తెలివిగా వ్యవహరించి మంచి లాభాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో ఆర్థిక విషయాల గురించి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు.
వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘ కాలిక రుణ బాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. వారం ప్రారంభంలో ఇతరులతో వాదాలకు దూరంగా ఉండటం మంచిది.
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది . బంధువర్గం నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. వారం మధ్యలో కొన్ని పనులు నిలిచిపోతాయి.