నిద్ర మనసు, శరీరానికి విశ్రాంతినిస్తుంది. కానీ నిద్రలో మనం చూసే కొన్ని కలలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, ప్రతి కలలో ఒక సంకేతం దాగి ఉంటుంది. కొన్ని కలలు మన జీవితానికి హెచ్చరికగా వస్తాయి. ఏ కలలు వస్తే జాగ్రత్తగా ఉండాలో చూద్దాం.
నిద్రలో మనకు తెలియకుండానే మన మనస్సు సృష్టించే దృశ్యాలే కలలు. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకు లోతైన అర్థాలు ఉంటాయి. కొన్ని కలలు సాధారణమైనవి అయితే.. మరికొన్ని కలలు భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలు, మానసిక ఒత్తిళ్లు లేదా జీవిత మార్పులకు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా కొన్ని కలలు పదేపదే వస్తుంటే, వాటిని నిర్లక్ష్యం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
27
ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోవడం
స్వప్న శాస్త్రం ప్రకారం కలల్లో మనం ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోవడం అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. ఇది జీవితంలో నియంత్రణ కోల్పోవడం, ఆర్థిక నష్టం లేదా కీలక నిర్ణయాల్లో తప్పులు జరగబోతున్నాయనే సంకేతం. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా సంబంధాల విషయంలో ఈ తరహా కలలు వస్తే ఆచితూచి అడుగులు వేయాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
37
పళ్లు ఊడిపోయిన కల
అలాగే కలలో పళ్లు ఊడిపోవడం లేదా రక్తం కనిపించడం కూడా అపశకున సూచనగా స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు, అనవసరమైన గొడవలు లేదా మానసిక బలహీనతకు సంకేతం కావచ్చు. ఇలాంటి కలలు వస్తే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, నిత్యం ప్రార్థన లేదా ధ్యానం చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పాము కనిపిస్తే.. ఒకవైపు శత్రువుల సూచనగా, మరోవైపు అంతర్గత భయం లేదా అణచివేసిన కోరికలకు సంకేతంగా చెబుతారు. ముఖ్యంగా పాము కాటేసినట్టు కల వస్తే, నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అలాంటి సమయంలో ఎవరి మీద అతి విశ్వాసం పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
57
నీటిలో మునిగిపోయే కల
నీళ్లలో మునిగిపోవడం లేదా ఊపిరి ఆడకపోవడం వంటి కలలు కూడా తీవ్ర హెచ్చరికగా స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇవి జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, అప్పులు, బాధ్యతలు మనస్సును ముంచెత్తుతున్నాయనే సూచన. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ తరహా కలలు వస్తే విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నామా, మనసుకు కావాల్సిన శాంతిని నిర్లక్ష్యం చేస్తున్నామా అన్నది ఆలోచించుకోవాలి. అవసరమైతే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
67
చనిపోయిన వ్యక్తులు కలలో వస్తే
చనిపోయిన వ్యక్తులు కలలో మళ్లీ మళ్లీ కనిపించడం కూడా చాలా మంది భయపడే విషయం. స్వప్న శాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా చెడు సంకేతం కాకపోయినా, వారు చెప్పే మాటలు చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఆ మాటలు మన జీవితంలో జరగబోయే ప్రమాదాలకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చని పండితులు చెబుతున్నారు. అలాంటి కలలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా, మన ప్రవర్తన, నిర్ణయాలను పునఃపరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.
77
ప్రతికూల కలలు పదే పదే వస్తే..
జ్యోతిష్య నిపుణుల ప్రకారం ప్రతికూల కలలు పదేపదే రావడం వెనుక గ్రహదోషాలు, మానసిక అశాంతి లేదా నెగటివ్ ఎనర్జీ కారణం కావచ్చు. అలాంటి సమయంలో దానం చేయడం, సద్గుణాలు అలవర్చుకోవడం, నిద్రకు ముందు ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం.