Solar Eclipse: 2026 సంవత్సరం వచ్చాక తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న రాబోతోంది. ఈ సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశులకు కష్టాలు కలిగే అవకాశం ఉంది. భారత్‌లో సూర్యగ్రహణం ప్రత్యక్షంగా కనిపించకపోయినప్పటికీ రాశులపై ప్రభావం ఉండే అవకాశం ఉంది.
కొత్త ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణాన్ని వలయాకార గ్రహణంగా చెబుతున్నారు. అంటే చంద్రుడు.. సూర్యుడిని పూర్తిగా కప్ప లేకపోయినా సూర్యుడు చుట్టూ సన్నని వెలుగు రేఖ వలయంలా కనిపిస్తుంది. సూర్యగ్రహణం అనేది చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు జరిగే ఖగోళ ప్రక్రియ. దీనికి భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం ఈ గ్రహణాలు వ్యక్తుల జీవితాల పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఈ గ్రహణ సమయంలో కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా సూర్యుడు, రాహువు ఒకే రాశిలో కలవడం వల్ల గ్రహణ యోగం కూడా ఇదే సమయంలో ఏర్పడుతుంది. అప్పుడు సూర్యుడు రాహు ప్రభావంలోకి వస్తాడు. మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి.
24
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం ఎనిమిదవ ఇంట్లో జరుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం ఎనిమిదవ ఇల్లు ఆకస్మికంగా వచ్చి పడే అడ్డంకులకు, కష్టాలకు కేంద్రంగా చెప్పుకుంటారు. గుండె జబ్బులు ఉన్నవారు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పాత అనారోగ్య సమస్యలు తిరిగి రావచ్చు. చేసే కార్యాలయంలో అనవసర రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది. అలాగే ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామితో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మాటలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.
34
కన్యా రాశి
ఈ సూర్య రాహుసంయోగం కన్యా రాశి వారికి ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తుంది. సూర్యగ్రహణం ప్రభావాలు వీరిపై అకస్మాత్తుగా పడతాయి. పనుల్లో అంతరాయం కలుగుతుంది. సామాజిక గౌరవం కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. ఆస్తి లేదా ప్రభుత్వ పత్రాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయాలు ఏవీ తీసుకోకూడదు. లేకుంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
మీన రాశి వారికి ఈ గ్రహణం 12వ ఇంట్లో సంభవిస్తుంది. 12వ ఇల్లు అనేది ఖర్చులు నష్టాలతో సంబంధం ఉన్న ఇల్లు. కాబట్టి సమయంలో మీరు ఖర్చులు అధికంగా చేసే అవకాశం ఉంటుంది. సూర్యుడు, రాహువు కలయిక ప్రేమ సంబంధాలలో దూరాన్ని పెంచుతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే ఉండడం మంచిది. అలాగే మీ రహస్య సమాచారాలను ఎవరితోనూ పంచుకోకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. లేకుంటే ఆసుపత్రికి ఎక్కువ ఖర్చులు చేయాల్సి వస్తుంది.