మేషం: ఈ రాశి వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని, ఉన్నత స్థాయి జీవనశైలిని, ధనవంతులతో సమయం గడపడాన్ని చాలా ఇష్టపడతారు. కెరీర్, ఉద్యోగం, వ్యాపారంలో ఆదాయం పెరుగుదల , ప్రముఖులతో సంబంధాలు పెరగడం వల్ల, ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వారు స్త్రీ, పురుష స్నేహితులతో సెలవులకు వెళతారు. ఫ్యాషన్ , అలంకరణ వస్తువులపై ఖర్చు గణనీయంగా పెరుగుతుంది.