Venus Transit: తుల రాశిలో శుక్రుడు....ఈ మూడు రాశుల జీవితాల్లో కనక వర్షం కురవడం ఖాయం

Published : Oct 30, 2025, 10:26 AM IST

Venus Transit:  కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని ద్వాదశి తిథి రోజున తులసి వివాహం జరుపుకుంటారు. ఇదే రోజున శుక్రుడు తన సంచారం చేయనున్నాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారనున్నాయి. 

PREV
14
venus transit

జోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి లక్ష్మీ దేవితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ శుక్ర గ్రహం తుల రాశిలోకి అడుగుపెడుతోంది. తులసి వివాహం ఈ నెల నవంబర్ 2వ తేదీన జరుపుకోనున్నారు. ఈ శుభ సమయంలోనే గ్రహ మార్పు జరగనుంది. దీని ప్రభావం జోతిష్య శాస్త్రంలోని 12 రాశులకు చెందిన వారిపై పడనుంది. మరీ ముఖ్యంగా మూడు రాశుల వారి అదృష్టం రెట్టింపు కానుంది. వారి జీవితాల్లో కనక వర్షం కురుస్తుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా....

24
1.కన్య రాశి....

తులసి కళ్యాణం వేళ శుక్ర గ్రహ మార్పు కన్య రాశివారికి చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కెరీర్ లో మంచి స్థాయికి వెళ్లగలరు. గతంలో పూర్తి కాని పనులన్నీ ఇప్పుడు పూర్తి చేయగలరు. కొత్త వాహనం కొనాలి అనే కోరిక కూడా నెరవేరుతుంది. శుక్రుని ప్రభావం కారణంగా, కుటుంబంతో అనుబంధం మెరుగుపడుతుంది. అందరి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఇది సరైన సమయం. కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి.

34
2.తుల రాశి...

తుల రాశిలో శుక్ర సంచారం ఈ రాశి వారికి చాలా ప్రయోజనాలు కలిగించనుంది. ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. వివాహానికి సంబంధించి ఏవైనా అడ్డంకులు ఉంటే, అవి తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు ఏవైనా ఆస్తి కొనుగోలు చేయడం, అమ్మడం గురించి ఆలోచిస్తుంటే.. మంచి విజయం సాధించగలరు. పని పరంగా కొత్త అవకాశాలను పొందుతారు. మీ కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంటుంది. భార్యభర్తల బంధం కూడా బలపడుతుంది.

44
మీన రాశి....

శుక్ర రాశిలో మార్పు కారణంగా మీన రాశి వారి జీవితం ఆనందంగా మారుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు మాటలతో అందరినీ ఆకర్షిస్తారు. ఈ రాశివారికి వివాహ యోగం కూడా ఉంటుంది. మీరు ఏదైనా పనికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంటే, ఈ కాలంలో మీ సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కెరీర్ లో ఎక్కువ లాభాలు పొందుతారు. ఈ కాలంలో, మీన రాశి వారు కొత్త ప్రాజెక్టుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందడం ద్వారా భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు వేస్తారు. అదేవిధంగా, ఈ కాలంలో మీ స్నేహితులు, జీవిత భాగస్వామితో మీ ప్రేమ , స్నేహం పెరుగుతుంది. ఈ కాలంలో మీన రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories