Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉన్నత ఉద్యోగాలు చేసి విపరీతంగా డబ్బు సంపాదిస్తారు

Published : Oct 30, 2025, 09:56 AM IST

Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో జన్మించిన వారు  జీవితంలో ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. ఎంతో పెద్ద ఉద్యోగాలను సాధిస్తారు.  నెలలో ఏ తేదీలలో పుట్టిన ఎక్కువ సంపాదిస్తారో ఇక్కడ ఇచ్చాము. 

PREV
14
ఈ తేదీలలో జన్మించినవారు లక్కీ

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారు చాలా లక్కీ.  వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. అంటే వారు పుట్టిన తేదీలలోని అంకెలు కలిపితే ఒకటి నెంబర్ వస్తుందన్న మాట. రాడిక్స్ సంఖ్య 1 ఉన్నవారు చాలా  స్నేహంగా ఉంటారు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు.  వీరు చాలా త్వరగా సంబంధాలను పెంచుకుంటారు. తమ స్వభావంతో ఇతరుల మనసును గెలుచుకుంటారు.

24
సూర్యుడి పాలకుడు

రాడిక్స్  సంఖ్య 1 గల వారిని పాలించేది సూర్యుడు. అందుకే వీరు చేసే పనులు, మాటలు చుట్టుపక్కల వారిని చాలా నచ్చుతాయి. అంతేకాదు వీరెంతో నిజాయితీగా కూడా ఉంటారు. వీరికి ధైర్యం ఎక్కువ. అలాగే ఆత్మాభిమానం కూడా ఎక్కువే. జీవితంలోని సవాళ్లకు వీరు ఏమాత్ర చలించరు.

34
వ్యాపారంలో సిద్ధహస్తులు

పైన చెప్పిన తేదీలలో పుట్టినవారికి వ్యాపారం బాగా లాభిస్తుంది. వీరు మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు. వారి సామర్థ్యం, వాక్చాతుర్యం, సమయ పాలన వంటివి వారిని వ్యాపారంలో రాణించేలా చేస్తాయి. వీరు ఏ పనినైనా పరిపూర్ణంగా పూర్తి చేశాకే వదిలిపెడతారు. వీరు ఏ పనినైనా పద్ధతిగా చేసే అలవాటు ఉన్నవారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. 

44
ఉన్నత ఉద్యోగాలు

రాడిక్స్ సంఖ్య 1 ఉన్నవారు ధనవంతులుగా ఉంటారు. వీరికి డబ్బును సంపాదించి పెట్టే ఉన్నత ఉద్యోగాలు వస్తాయి. అందుకే వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వీరికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. రాడికస్్ సంఖ్య 1 ఉన్నవారికి ఆదివారం, సోమవారం బాగా కలిసొచ్చే రోజులు. వీరు ఏ పనినైనా ప్రారంభించాలంటే ఈ రెండు రోజులు కలిసివస్తాయి. వీరికి పసుపు రంగు శుభప్రదమైన రంగుగా చెప్పుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories