
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంబంధించి విలువైన సమాచారం తెలుస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చులు తప్పవు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబసభ్యుల నుంచి ఆర్థిక ఒత్తిడి తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృథా ఖర్చులు చేదాటుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది.
వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు.
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సంతాన విద్యా, ఉద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధు వర్గం నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిన్నపాటి చికాకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.