Venus Transit: శని చేతిలో చిక్కిన శుక్రుడు.. ఈ 3 రాశులవారి జీవితం అల్లకల్లోలమే!

Published : Jan 12, 2026, 02:55 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు, శని సొంత రాశి అయిన మకరరాశిలోకి నేడు(జనవరి 12) ప్రవేశించనున్నాడు. శుక్రుడి సంచారం మూడు రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వనుంది. వారి జీవితం ఒక్కసారిగా తలకిందులు కానుంది. మరి ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

PREV
15
Venus Transit in Capricorn

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. ఆనందం, సంపద, బంగారం, వస్తువులు, విలాసాలకు కారకుడు శుక్రుడు. నేడు (జనవరి 12న) శని సొంత రాశి అయిన మకర రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశులకు ఆర్థిక సమస్యలు, ఆకస్మిక నష్టాలు తీసుకువస్తుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. మరి ఆ రాశులేంటో.. వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

25
మేష రాశి

మకర రాశిలో శుక్రుడి సంచారం మేషరాశి వారికి కష్టాలు తెస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరు ఈ సమయంలో ఆర్థిక నష్టాలు ఎదుర్కుంటారు. అప్పుల సమస్యల్లో చిక్కుకుంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరుగుతుంది. కుటుంబం, ప్రేమ జీవితంలో సమస్యలు రావచ్చు. పనుల్లో జాప్యం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల వల్ల అవమానాలు ఎదురుకావచ్చు.

35
కర్కాటక రాశి

శుక్ర సంచార సమయంలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడి ప్రతికూల సంచారం వల్ల ఆర్థిక నష్టాలు కలగవచ్చు. కొత్త పనులను వాయిదా వేయడం మంచిది. పై అధికారులతో వాదనలకు దిగొద్దు. ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తలెత్తుతాయి. ఇంటా బయటా చికాకు వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. 

45
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శుక్ర సంచారం అనుకూలంగా లేదు. ఆకస్మిక ఆర్థిక సమస్యలు రావచ్చు. అప్పులు చేయాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం తగ్గుతుంది. అనవసర విషయాల్లో చిక్కుకుంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది. అనవసర ప్రయాణాలు, శారీరక, మానసిక శ్రమ పెరుగుతుంది. కడుపు, ఛాతీలో మంట వంటి సమస్యలు రావచ్చు. ఈ రాశివారు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

55
ఈ 3 రాశులవారు ఏం చేయాలంటే?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం..  ఈ మూడు రాశులవారు శుక్రుడి అధిపతి అయిన మహాలక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే శుక్రుడి వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పేద మహిళలకు ఆహార పదార్థాలు లేదా వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా శుక్ర సంచార ప్రభావాలు తగ్గుతాయి.రోజూ 24 సార్లు 'ఓం శుక్రాయ నమః' అనే మంత్రాన్ని జపించడం, అమ్మవారికి తెల్లని పూలతో అర్చన చేసినా కష్టాలు తగ్గే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories