ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట, సుఖాలు ఉంటాయి. కానీ కొందరి జీవితంలో వచ్చే కష్టాలు జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేస్తాయి. జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారికి లైఫ్ టర్నింగ్ షాక్ తప్పదట. ఆ తేదీలేంటో చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారికి జీవితంలో ఒక పెద్ద షాక్ తప్పనిసరిగా ఎదురవుతుంది. అది వారి ఆలోచనా విధానం, సంబంధాలు, కెరీర్, కొన్నిసార్లు వాళ్ల స్వభావాన్నే పూర్తిగా మార్చేసే బలమైన మలుపు. ముఖ్యంగా ఏ నెలలో అయినా 4, 7, 13, 16, 19, 22 తేదీల్లో పుట్టినవారు ఈ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారని న్యూమరాలజీ చెబుతోంది.
25
నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోవడం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారిని నమ్మిన వ్యక్తి దెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువ. అది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. లేదా ఎంతో నమ్మిన పార్ట్‌నర్ కావచ్చు. ఇతను నా మనిషి అని నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా దూరం కావడం, మోసం చేయడం లేదా మనసు ముక్కలు చేయడం వంటివి వీళ్ల జీవితంలో పెద్ద షాక్‌గా మారుతాయి. కొందరికి ఇది చిన్న వయసులోనే ఎదురుకాగా.. మరికొందరికి సెటిల్ అయిన తర్వాత ఎదురవుతుంది. కానీ ఆ షాక్ తర్వాత వాళ్లు అంతకు ముందులా మాత్రం ఉండరు.
35
శని, రాహు ప్రభావంతో..
తేదీల్లో పుట్టినవారిపై శని, రాహు లేదా కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం వల్ల వీరి జీవితంలో అంతా బాగుంది అనుకున్న సమయానికి ఒక్కసారిగా కూప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. ఉద్యోగం పోవచ్చు, వ్యాపారం కూలిపోవచ్చు, ప్రేమ విఫలం కావచ్చు. లేదా కుటుంబంలో ఊహించని సంఘటన జరగవచ్చు. అయితే వీరిలో దాగి ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసేందుకు ఇలాంటి షాక్ తగులుతుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.
ఆ షాక్ తర్వాత వీళ్లు పూర్తిగా బ్రేక్ అవుతారు. ఎవ్వరినీ పూర్తిగా నమ్మరు. వారిమీద వారికే అనుమానం మొదలవుతుంది. కానీ రాను రాను అదే షాక్ వీళ్లలోని బలహీనతలను కాల్చేస్తుంది. అంతకుముందు ఎమోషనల్ గా ఉన్నవారు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు.
55
తర్వాతే అసలు సక్సెస్
ఈ తేదీల్లో పుట్టినవారు పెద్ద షాక్ తర్వాత వారి చుట్టూ ఎంతమంది ఉన్నా.. చాలా తక్కువ మందిని మాత్రమే నమ్ముతారు. గతంలో అందరి సంతోషం గురించే ఆలోచించే వీరు షాక్ తర్వాత వారి గురించి మాత్రమే ఆలోచించడం మొదలుపెడతారు. ఈ షాక్ తర్వాతే వీళ్ల జీవితంలో అసలు సక్సెస్ మొదలవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.