Zodiac signs: జూన్ 13తో ఈ రాశుల దరిద్రం మొత్తం వదిలినట్లే..!

Published : Jun 12, 2025, 02:04 PM IST

శుక్ర గ్రహం నక్షత్ర మార్పు.. మూడు రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది. శుక్ర గ్రహం.. మనిషి జీవితంలో ఆనందం, ధనం, భద్రత తీసుకువస్తాయి.

PREV
14
Venus transit

జోతిష్యశాస్త్రంలో తరచూ గ్రహాలు మారుతూనే ఉంటాయి. ఈ గ్రహాలు రాశులు, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పు అన్ని రాశులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. జూన్ 13వ తేదీన కూడా ఇలాంటి మార్పే ఒకటి జరగనుంది. శుక్రుడు భరణి నక్షత్రంలో సంచరించనున్నాడు. దీని ప్రభావం మూడు రాశులపై చాలా ఎక్కువగా చూపించనుంది. ఆ మూడు రాశుల కష్టాలు మొత్తం తీరిపోయి..అదృష్టం పెరగనుంది.

శుక్ర గ్రహం శుభ పరిస్థితిలో ఉన్నప్పుడు మనిషి జీవితంలో ఆనందం, ధనం, భద్రత వంటి అంశాలు మెరుగౌతాయి. ఇక జూన్ 13న శుక్రుడు భరణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల మూడు రాశులపై విశేష ప్రభావం చూపించనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా...

24
1.వృశ్చిక రాశి..

శుక్రగహ నక్షత్ర మార్పు.. వృశ్చిక రాశి వారికి జీవితంలో అనేక అవకాశాలు ఏర్పడుతాయి.ముఖ్యంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వైవాహిక జీవితం మెరుగుదల కనిపిస్తుంది.గతంలో ఉన్న గందరగోళాలు తొలగి, సంతోషంగా గడుపుతారు.ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. శారీరకంగా శక్తివంతంగా తయారౌతారు.వాహన యోగం కూడా ఉంది. కారు లేదా, బైక్ కొనే అవకాశం ఉంది.

34
2.మేష రాశి...

శుక్రుడు నక్షత్ర మార్పుతో మేష రాశి వారికి విశేష అనుకూలతలు కనిపిస్తాయి. జీవితంలో ఆనందం పెరుగుతుంది. సంతోషకరమైన మార్పులు జరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనపడుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. భార్యభర్తల మధ్య ప్రేమ బలపడుతుంది. సంపాదన కూడా పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇదే సరైన సమయం.

44
3.మిథున రాశి..

మిథునరాశివారికి శుక్రుడి ప్రవేశం అనేక శుభఫలితాలు అందిస్తుంది.వివాహ యోగం ఉంది.పెళ్లిళ్లు జరగొచ్చును లేదా అనుకున్న భాగస్వామిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులపై మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది.ఈ సమయంలో చేసిన పనుల్లో సులభంగా విజయాలు సాధించగలుగుతారు. జీవితంలో కొత్త పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.

ముగింపు:

శుక్రుని భరణి నక్షత్ర ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టాన్ని, ధనాన్ని, ఆనందాన్ని తీసుకొస్తోంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఒకవేళ మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నా, ఉన్నత ఫలితాలు పొందే అవకాశాలుంటాయి. జ్యోతిష్య నిపుణుల సలహాతో ముందుకు వెళ్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories