Astrology: 30 ఏళ్ల త‌ర్వాత మీన రాశిలోకి శ‌ని.. ఈ 3 రాశుల వారి జీవితంలో ఊహించ‌ని మార్పులు

Published : Jun 12, 2025, 12:21 PM IST

జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాల గమన మార్పులు మన జీవితాలపై గణనీయ ప్రభావం చూపుతాయి. ఈ జూలైలో శని, కుజుడుల సంచార మార్పులు కొన్ని రాశుల వారిపై ప్ర‌భావం చూపనుంది. ఇంత‌కీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
30 ఏళ్ల త‌ర్వాత తిరోగ‌మ‌నం

శని 30 సంవత్సరాల తర్వాత తిరోగమనంగా మీనరాశిలో ప్రవేశిస్తుండగా, కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల మార్పుల ప్రభావం కొన్ని రాశులపై అత్యంత అనుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా 3 రాశుల వారి జీవితాల్లో ఊహించ‌ని మార్పులు రానున్నాయి.

25
ధనుస్సు రాశి:

వృత్తిలో గట్టి పురోగతి, సంపదలో వృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో శని, కుజు సంచారం శుభదాయకంగా మారుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, శాల‌రీ పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు, కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది.

మానసిక స్థిరత, ఆత్మవిశ్వాసం పెరిగి, కుటుంబంతో శుభ సందర్భాలు జరగొచ్చు. నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయంగా చెప్పొచ్చు.

35
మ‌క‌ర రాశి:

మ‌క‌ర‌రాశి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల స‌మ‌యంగా చెప్పొచ్చు. పాత పెట్టుబడుల్లో లాభాలు రావచ్చు. ఆత్మ విశ్వాసంతో ప‌నుల్లో దూకుడు పెంచుతారు.

45
మీన రాశి:

శని తిరోగమనంగా మీనరాశిలోకి ప్ర‌వేశిస్తున్నాడు. ఈ అరుదైన సంఘ‌ట‌న 30 ఏళ్ల త‌ర్వాత జ‌రుగుతోంది. దీంతోపెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

 ఉద్యోగం, వ్యాపార మార్పులకు ఇది ఉత్తమ సమయంగా చెప్పొచ్చు.సామాజిక గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో కొత్త ఆరంభానికి ఇది మంచి టైమ్ అని చెప్పొచ్చు.

55
కుజుడు కన్యారాశిలోకి:

కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించడమంటే నిపుణత, క్రమశిక్షణ, శ్రమకు ఫలితాల కాలం ప్రారంభం అన‌డానికి సూచ‌న‌గా చెప్పొచ్చు. కొన్ని రాశుల వారికీ అనుకున్న పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు, ప్రయాణాలు చేసే అవ‌కాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories