3. మకర రాశి (Capricorn): గౌరవ మర్యాదలు - కుటుంబ సౌఖ్యం
మకర రాశి వారికి సంక్రాంతి తర్వాత సమయం రాజవైభవాన్ని తెచ్చిపెడుతుంది.
సామాజిక హోదా: సమాజంలో మీ ప్రతిష్ఠ విపరీతంగా పెరుగుతుంది. మీరు చేసే కృషికి పై అధికారుల నుండి పూర్తి ప్రశంసలు దక్కుతాయి.
వ్యాపార ఒప్పందాలు: వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ల నుంచి భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కుటుంబం: దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు కనుమరుగై, అందరూ సంతోషంగా గడుపుతారు.
ఫైనల్ గా...
30 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ త్రి ఏకాదశ యోగం, శని , శుక్రుల అనుగ్రహంతో ఈ మూడు రాశుల వారి ఆర్థిక, వ్యక్తిగత జీవితాలను మలుపు తిప్పబోతోంది. సంక్రాంతి తర్వాత వీరి జాతకంలో కొత్త వెలుగులు రావడం ఖాయం.