ప్రతి ఒక్కరికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటి ప్రకారమే వారు నడుచుకుంటారు. శాస్త్రాలను ఫాలో అవుతూ ఉంటారు. ఏదైనా శాస్త్ర ప్రకారం చేస్తే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావని గట్టిగా నమ్ముతారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల్లో మానవ జీవితాల గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాస్తు ప్రకారం పెళ్లైన కూతురికి 3 వస్తువులను అస్సలు బహుమతిగా ఇవ్వకూడదట. అవెంటో? ఎందుకో? ఇక్కడ చూద్దాం.
తల్లిదండ్రులు పిల్లలను ఎంత అపురూపంగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలను. వారు కోరితే ఏదైనా తెచ్చి ఇవ్వడానికి రెడీగా ఉంటారు అమ్మానాన్నలు. ఆడపిల్ల పెళ్లి చేసుకొని మరొక ఇంటికి వెళ్లినప్పుడు తనకు అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా కావాల్సినవన్నీ సమకూర్చుతూ ఉంటారు. ఇలా పెళ్లైన కూతురికి గిఫ్ట్ లు ఇవ్వడం సహజం. అయితే గిఫ్ట్ లు ఇచ్చేముందు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి అంటున్నారు వాస్తు నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లైన కూతురుకు ఈ 3 వస్తువులను అస్సలు గిఫ్ట్ గా ఇవ్వకూడదట. అవెంటో ఇక్కడ చూద్దాం.
25
పెళ్లైన కూతురుకు ఇవ్వకూడని గిఫ్ట్ లు?
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం, కొన్ని వస్తువులు పెళ్లైన కూతురికి ఇవ్వడం అస్సలు మంచిది కాదట. దానివల్ల సంబంధాల్లో చీలికలు, ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి లాంటి సమస్యలకు కారణం కావచ్చట. వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లైన కూతురికి తల్లిదండ్రులు ఇవ్వకూడని గిఫ్ట్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
35
నల్లటి బట్టలు:
వాస్తు శాస్త్రం ప్రకారం నలుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. పెళ్లి తర్వాత మీ కూతురికి నల్లటి బట్టలు గిఫ్ట్‌గా ఇవ్వడం వల్ల ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయట. ముఖ్యంగా ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని దూరం చేస్తుందట. కుటుంబ సంబంధాలను బలహీనపరుస్తుందట. కాబట్టి పెళ్లైన కూతురికి ఎప్పుడూ నలుపు రంగు బట్టలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు. బదులుగా వేరే రంగుల బట్టలు గిఫ్ట్‌గా ఇవ్వచ్చు.
45
గాజు వస్తువులు:
పెళ్లైన కూతురికి గాజు వస్తువులు గిఫ్ట్‌గా ఇవ్వడం వల్ల ఆమె జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. గాజు బలహీనత, అస్థిరత్వానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇది జీవితంలో ఇబ్బందులు కలిగిస్తుందని నమ్ముతారు. గాజు వస్తువులు సులభంగా పగిలిపోతాయి. దీనివల్ల ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో చీలికలు వస్తాయని నమ్ముతారు.
55
ఊరగాయ:
ఊరగాయ కారంగా, పుల్లగా ఉండటం వల్ల వాటిని సంబంధాల్లో పులుపునకు సంకేతంగా పరిగణిస్తారు. కాబట్టి పెళ్లైన కూతురికి ఊరగాయ గిఫ్ట్‌గా ఇస్తే అది ఆమె వైవాహిక జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. ధార్మిక నమ్మకాల ప్రకారం, ఊరగాయ ఇవ్వడం అత్త, కోడలి మధ్య భిన్నాభిప్రాయానికి కారణం కావచ్చట. కాబట్టి మీ కూతురికి ఎప్పుడూ ఊరగాయ ఇవ్వకండి. బదులుగా స్వీట్స్ ఇవ్వడం మంచిది. ఇది సంబంధాల్లో తియ్యదనాన్ని పెంచుతుంది.