వేణుస్వామి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. సినీ, రాజకీయ జ్యోతిష్యాలకు పెట్టింది పేరు ఈయన. సమంత-నాగచైతన్య విడిపోతారంటూ చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్న వేణు స్వామి ఆ తర్వాత పలు సంచనల వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వేణుస్వామి జ్యోతిష్యంలోనూ సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విశ్వావసు నామ సంవత్సరంలో జరగబోయే పరిణామాల గురించి వేణు స్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Venu Swamy
ఓ ఇంటర్వ్యూలో ఈ ఏడాది ఎలా ఉండనుందన్న వివరాలను పంచుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి సూర్యుడు అధిపతి. ఈ ఏడాది నుంచి ప్రపంచంలో చాలా ప్రతికూల అంశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రకృతిపరంగా, రాజకీయంగా, దేశాలపరంగా, మానవ సంబంధాలను రవి కమాండ్ చేయనున్నారు. 2024తో పోల్చితే 2025 చాలా డేంజర్ అని వేణు స్వామి తేల్చి చెప్పారు. 2028 వరకు మొత్తం 4 ఏళ్లు చాలా నెగిటివ్ అంశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
విశ్వసనామ సంవత్సరంలో విమాన ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి అన్నారు. అలాగే పడవ, రైలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. వచ్చే ఏప్రిల్,మే నెలలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ ఏడాది విడాకులు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. రవి మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండొచ్చని వేణుస్వామి తెలిపారు. ఈ ఏడాది ఆడవారికి పదవులు వరిస్తాయన్నారు. అయితే నేరాల్లో మహిళల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు సినిమా, రాజకీయ రంగంలో సంచలనాలు జరిగే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పుకొచ్చారు.
నోట్: ఈ వివరాలు కేవలం ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలిపిన అంశాలను క్రోడీకరించి అందించడం జరిగింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.