Vastu Tips: మీరు అనుకున్న పనులు జరగాలన్నా, ఇంటర్వ్యూలో సెలక్ట్ కావాలన్నా మీరు కొన్ని పరిహారాలను చేస్తే మంచి ఫలితం ఉంటుదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మంది వాస్తు చిట్కాలను ప్రతి దానికి పాటిస్తుంటారు. అయితే మీరు అనుకున్న పనులు పూర్తి కావాలన్నా, కోరుకున్న ఉద్యోగాన్ని పొందాలన్నా కొన్నివాస్తు పరిహారాలను పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. చాలా మంది ఎన్ని సార్లు ప్రయత్నించినా సక్కెస్ ను రీచ్ కాలేకపోతుంటారు. దీనివల్ల నిరాశే మిగులుతుంది. బాగా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రంలో ఉన్న కొన్ని చిట్కాలను పాటిస్తే గనుక మీరు ప్రతిదాంట్లో విజయం సాధిస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
24
ఇంటర్వ్యూకు వెళ్లడానికి ముందు దీన్ని జపించండి
ఇంటర్వ్యూ లేదా ముఖ్యమైన పనులకు వెళ్లే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దానికోసం ప్రిపేర్ అవ్వడం లాంటివి చేస్తుంటారు. వీటితో పాటుగా ఈ రోజున ఉదయాన్నే రాగి పాత్రలో నీళ్లను తీసుకుని అందులో నీళ్లు, బెల్లం వేసి సూర్య భగవానుడికి సమర్పిస్తే అనుకున్నదా సాధిస్తారని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అయితే దేవుడికి నీళ్లను సమర్పించేటప్పుడు మర్చిపోకుండా "ఓం హ్రీం సూర్య నమః" అని అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం మంచిది.
దీనివల్ల సూర్య భగవానుడి కృప మీపై ఉంటుంది. అలాగే జీవితంలో సక్కెస్ ను చూస్తారు. అలాగే ఇంటర్వ్యూకు వెళ్లేముందు ఖచ్చితంగా వినాయకుడికి పూజ చేయండి. ధ్యానం చేయండి. అలాగే గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కూడా మీరు విజయం సాధిస్తారు. అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు.
34
పర్సులో వీటిని పెట్టుకోండి
ఉద్యోగం సంపాదించడం కోసం ఇంట్యర్వ్యూకు వెళ్తున్నట్టైతే మీ జేబులో ఎండు తులసి ఆకులను పెట్టుకోండి. లేదా నల్ల నవ్వులను ఒక చిన్న క్లాత్ లో కట్టి పెట్టుకున్నా సరిపోతుంది. వీటివల్ల మీకు ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి. కాబట్టి దీనితో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నా, ఇంటర్వ్యూకు వెళ్తున్నా మీ పర్సులో ఒకటి రెండు పసుపు కొమ్ములను లేదా కొన్ని బియ్యాన్ని ఉంచుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇలా చేయడం వల్ల మీరు సక్సెస్ ను సాధించే అవకాశం ఉంది.
మీరు విజయం సాధించాలంటే మాత్రం మీ ఇంట్లో ఎలాంటి నెగిటీవిటీ ఉండకూడదు. ముఖ్యంగా మీపై. దీనివల్ల మీ ఆలోచనలు మారుతాయి.అందుకే ముఖ్యమైన పనులపై లేదా ఇంటర్వ్యూకు బయటకు వెళ్లేముందు మీ మనస్సులో నెగిటీవ్ ఆలోచనలు రానీయకండి. అలాగే ఇంటర్వ్యూకు అవసరమైన ముఖ్యమైన పత్రాలను బ్యాగ్ లో పెట్టుకోండి. వీటిని ఎట్టిపరిస్థితిలో మర్చిపోకూడదు.