Zodiac signs: ఈ రాశులవారికి పెళ్లి చాలా ఆలస్యం.. 30 దాటనిది పెళ్లి కావడం చాలా కష్టం..!

Published : Sep 24, 2025, 09:58 AM IST

Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు రాశులకు చెందిన వారు ఆలస్యంగా వివాహం చేసుకునే అవకాశం ఉంది. మరి, అలాంటి రాశులు ఏంటి? వీరి వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది..? అనే విషయాలు తెలుసుకుందామా...

PREV
15
Zodiac signs

వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. కానీ.. అది ఎప్పుడు అనే విషయం ఎవరికీ తెలీదు. కొందరికి చాలా తొందరగా పెళ్లి జరిగితే... మరి కొందరికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. జోతిష్య శాస్త్రంలో కూడా కొన్ని రాశులవారికి జీవితంలో పెళ్లి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటి? వారి వివాహం ఆలస్యం కావడానికి కారణం ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం..

25
1.మకర రాశి...

మకర రాశిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. శని కర్మ ప్రకారం ఫలితాలను ఇచ్చే దేవుడు. శని ప్రాతినిథ్యం వహించే మకర రాశివారు క్రమశిక్షణ తో ఉంటారు. వీరు దేనినీ తొందరగా అంగీకరించరు. చాలా లోతుగా ఆలోచిస్తారు. ముఖ్యంగా జీవితానికి సంబంధించిన విషయాల గురించి.. చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రాశివారికి తొందరగా ఎవరూ నచ్చరు. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తిని ఎంచుకోవడానికి వీరు చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. వారి జీవితంలో ఏ సంబంధం అయినా దృఢంగా ఉండాలని అనుకుంటారు. వీరి ఎక్కువ దృష్టి డబ్బు మీదే ఉంటుంది. ఉద్యోగం సంపాదించడం, భవిష్యత్తు కోసం డబ్బు సంపాదించడంపైనే వీరి దృష్టి ఉంటుంది. అందువల్ల మకర రాశివారు తమ యవ్వనాన్ని ఎక్కువగా వృథా చేసేసుకుంటారు. ఫలితంగా వివాహం ఆలస్యం అవుతుంది.

35
కుంభ రాశి..

కుంభ రాశివారు జీవితంలో మంచి భాగస్వామి అవ్వగలరు. వారు జీవితాంతం విశ్వాసపాత్రంగా ఉంటారు. కానీ, వైవాహిక జీవితంలో స్థిరపడటానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే.. వారు తమ స్వాతంత్య్రానికి గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్లి చేసుకుంటే తాము కోరుకున్న స్వేచ్ఛ దొరకదేమో అనే భావన వీరిలో ఉంటుంది. అందుకే... వీరు పెళ్లి చేసుకోవడం ఆలస్యం అవుతుంది. ఇక.. ఈ రాశిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. కాబట్టి.. వీరికి ఎక్కువ క్రమశిక్షణ, బాధ్యత ఉంటుంది. తమను చాలా ప్రేమగా చూసుకునే వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వ్యక్తిని వెతకడంలోనే వీరి సమయం అయిపోతుంది. దీని వల్ల వీరి వివాహం ఆలస్యం అవుతుంది.

45
కన్య రాశి...

కన్య ప్రతిదానిలోనూ పరిపూర్ణతను ఆశిస్తుంది. అంటే, ఏ పని అయినా, అది కుటుంబ విషయాలు అయినా, పరిపూర్ణంగా ఉండాలి. చేసే పనిలో ఎటువంటి లోపాలు ఉండకూడదు. కుటుంబ విషయాలు కూడా వంద సార్లు ప్లాన్ చేసి, ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పరిణతి చెందుతాయని వీరు భావిస్తారు. అందువల్ల, కన్య రాశి వారు ఏ విషయాన్ని సులభంగా , నిర్లక్ష్యంగా చేయరు. వారు ప్రతిదానిలోనూ పరిపూర్ణతను కోరుకుంటారు కాబట్టి, భాగస్వామి ఎంపిక నుండి వారు చాలా ఆశిస్తారు. వారు భాగస్వామి అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకుని సంతృప్తి చెందే వరకు వారు వివాహ జీవితంలోకి ప్రవేశించరు. వారి మాటలు పవిత్రమైనవి, స్వచ్ఛమైనవి. అదేవిధంగా, వారు తమ భాగస్వామి మాటలు స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటారు. అందువల్ల, వారు వివాహంలోకి తొందరపడరు. వివాహానికి తమను తాము సిద్ధం చేసుకోవడానికి వారు చాలా సమయం తీసుకుంటారు. దీనివల్ల ఆలస్యంగా వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది.

55
ధనస్సు రాశి...

ధనుస్సు వారి స్వాతంత్య్రానికి చాలా విలువ ఇస్తారు. వివాహం వారికి చాలా ముఖ్యమైనదిగా అనిపించదు. వారు మరింత స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. వివాహం వారి స్వేచ్ఛను ప్రభావితం చేయదని వారు నిర్ధారించుకునే వరకు వారు వివాహ జీవితంలోకి ప్రవేశించరు. వివాహానికి త్యాగాలు అవసరమని ధనుస్సుకు తెలుసు. కానీ దీనికి సరైన భాగస్వామి దొరికే వరకు వారు వేచి ఉంటారు. వారి వివాహం చాలా సమయం తీసుకున్నా వారికి అభ్యంతరం ఉండదు. సాహసం పై ఆసక్తి ఉన్న భాగస్వామి దొరికితే, వారు వివాహం గురించి ఆలోచిస్తారు. అలాంటివారు దొరికే వరకు పెళ్లి గురించి ఆలోచన చేయరు. అందుకే వీరికి పెళ్లి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories