Vastu Tips: మీ పర్సులో ఈ 5 వస్తువులు ఉంటే..డబ్బుకు లోటు ఉండదు..!

Published : Jan 24, 2026, 10:31 AM IST

 Vastu Tips: మీ పర్సులో ఎప్పుడూ డబ్బు ఉండాలన్నా..ఆదాయం పెరగాలన్నా, అనవసర ఖర్చులు తగ్గాలన్నా కొన్ని వాస్తు చిట్కాలు ఫాలో అవ్వాలి. మరీ ముఖ్యంగా ఐదు వస్తువులు ఉంచుకోవాలి.. 

PREV
13
Vastu Tips

వాస్తు శాస్త్రం ప్రకారం, మన పర్సు అనేది కేవలం డబ్బు దాచుకునే సంచి మాత్రమే కాదు, అది లక్ష్మీదేవికి నిలయం లాంటిది. పర్సును ఎలా ఉంచుకుంటాం, అందులో ఏ వస్తువులు ఉంచుతాం అనే దానిపై మన ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? మరి, ఎలాంటివి ఉంచాలో.. ఏవి ఉంచకూడదో తెలుసుకుందామా...

23
పర్సులో కచ్చితంగా ఉంచాల్సినవి ఇవే..

1. ఎర్రటి కాగితం (Red Paper)

ఎరుపు రంగు శక్తికి , సంపదకు చిహ్నం. ఒక చిన్న ఎర్రటి కాగితంపై మీ మనసులోని కోరికను (ఉదాహరణకు: నాకు మంచి ఆదాయం రావాలి) రాసి, దాన్ని ఒక ఎర్రటి దారంతో కట్టి పర్సులో ఉంచుకోండి. ఇది మీ చుట్టూ సానుకూల శక్తిని పెంచి, మీ లక్ష్యాలను చేరుకోవడానికి తోడ్పడుతుంది.

2. అక్షింతలు (21 బియ్యం గింజలు)

బియ్యం లక్ష్మీ దేవికి అత్యంత ప్రీతికరమైనవి. 21 బియ్యం గింజలను తీసుకుని, వాటికి కొంచెం పసుపు అద్ది ఒక చిన్న కవర్‌లో వేసి పర్సులో ఉంచండి. ఇలా చేయడం వల్ల అనవసరమైన ఖర్చులను తగ్గుతాయి. పర్సులో ఎప్పుడూ డబ్బు ఉండేలా చూస్తుంది.

3. రావి ఆకు (Peepal Leaf)

హిందూ ధర్మంలో రావి చెట్టు అత్యంత పవిత్రమైనది. ఒక శుభ్రమైన రావి ఆకును తీసుకుని గంగాజలంతో కడిగి, దానిపై కుంకుమతో'శ్రీ' (Shree) అని రాసి పర్సులో ఉంచుకోండి. ఆకు ఎండిపోయినప్పుడల్లా దాన్ని మార్చి కొత్త ఆకును పెట్టాలి. ఇది ధన యోగాన్ని కలిగిస్తుంది.

4. వెండి నాణెం లేదా లక్ష్మీ గవ్వలు (Silver Coin or Shells)

మీ పర్సులో లక్ష్మీ దేవి బొమ్మ ఉన్న వెండి నాణెం ఉంచుకోవడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. ఒకవేళ వెండి నాణెం అందుబాటులో లేకపోతే, రెండు చిన్న లక్ష్మీ గవ్వలను పర్సులో ఉంచుకోవచ్చు. గవ్వలు సముద్రం నుండి వస్తాయి కాబట్టి, సముద్ర తనయ అయిన లక్ష్మీ దేవికి ఇవి చాలా ఇష్టం.

5. యాలకులు (Green Cardamom)

యాలకులు కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇవి బుధ గ్రహానికి (Mercury) సంబంధించినవి. బుధుడు వ్యాపారానికి , ధనానికి కారకుడు. 2 లేదా 3 యాలకులను పర్సులో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. మీ పర్సులో నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.

33
పర్సులో పొరపాటున కూడా ఉంచకూడనివి ఇవే..

బిల్లులు వద్దు: పాత బిల్లులు, రసీదులు పర్సులో ఉంచకండి. ఇవి 'నెగటివ్ ఎనర్జీ'ని, అప్పులను సూచిస్తాయి.

చిరిగిన పర్సు: చిరిగిన పర్సును వాడటం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది. కాబట్టి పర్సు ఎప్పుడూ శుభ్రంగా, కొత్తగా ఉండేలా చూసుకోండి.

నోట్ల సర్దుబాటు: నోట్లను నలిపి పర్సులో వేయకండి. పెద్ద నోటు నుండి చిన్న నోటు వరకు క్రమ పద్ధతిలో అమర్చండి.

ఫోటోలు: చనిపోయిన వారి ఫోటోలను పర్సులో ఉంచకపోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories