Numerology: పిల్లలకు తల్లిదండ్రులే పెద్ద బలం. కానీ తల్లిదండ్రులు హిట్లర్‌లా శాసిస్తూ ఉంటే ఆ పిల్లలు స్వేచ్ఛగా జీవించలేరు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన తల్లిదండ్రులు పిల్లలపై అధిక భారాన్ని మోపుతారు. దీని వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు.
న్యూమరాలజీ ప్రకారం పుట్టిన ప్రతి తేదీ ఆ వ్యక్తి లక్షణాలను అంచనా వేసి చెప్పగలదు. నిజానికి ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని, లక్షణాలను కలిగి ఉంటాడు. తమ కోసం తాము ఎన్నో కలలు కంటారు. వాటిలో చాలా వరకు నెరవేరకపోవచ్చు. అలాంటప్పుడు వారు తల్లిదండ్రులుగా మారిన తర్వాత పిల్లల ద్వారా తమ కలలను నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. కొన్నిసార్లు ఆ తల్లిదండ్రులు హిట్లర్ లా మారి పిల్లలపై తమ ఇష్టాలను విపరీతంగా రుద్దుతారు. అధిక భారాన్ని మోపుతారు. అలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన పిల్లవాడు స్వేచ్ఛగా ఉండలేడు. సంతోషంగా జీవించలేడు. ముఖ్యంగా కొన్ని తేదీలలో జన్మించిన తల్లిదండ్రులు ఇలా హిట్లర్ లాంటి స్వభావాలను కలిగి ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. ఆ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు తమ పేరెంట్స్ ఆశయాలను నెరవేర్చే పనిలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.
24
మూల సంఖ్య 1
మూల సంఖ్య 1 అంటే ప్రతి నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారని అర్థం. ఆ తేదీలలో జన్మించిన వారు అద్భుతమైన నాయకులుగా ఎదుగుతారు. విజయాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు. అదే లక్షణాలు తమ పిల్లల్లో ఉండాలని కోరుకుంటారు. దీనివల్ల తమ పిల్లల కెరీర్ గురించి చాలా పెద్దగా కలలు కంటారు. కనీసం పిల్లలకు సొంత ఇష్టాలు ఉంటాయన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. తమకు నచ్చిన వాటిని పిల్లలపై రుద్దేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఆ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు తమకు ఇష్టమైన జీవితాన్ని, స్వేచ్ఛను అనుభవించలేరు. జీవితంలో ఏదైనా విజయం సాధించినప్పటికీ దాన్ని ఆ పిల్లవాడు ఆస్వాదించలేడు. అన్ని తమ తల్లిదండ్రుల కోసమే చేసినట్టు ఫీల్ అవుతాడు. ఇలాంటి పిల్లలు చిన్నప్పటినుంచి తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.
34
మూల సంఖ్య 4
ప్రతి నెలలో 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ నెంబర్ 4 అవుతుంది. వీరు ఎక్కువగా రాహు ప్రభావంలో ఉంటారు. రాహు గ్రహం చెడు స్థితిలో ఉంటే వీరు గందరగోళంగా ఉంటారు. విజయం త్వరగా రాదు. కోపం కూడా అధికంగా ఉంటుంది. వ్యసనాలకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువ. దీనివల్ల వారి ఇంటి వాతావరణం మారిపోతుంది. పిల్లలు కూడా సంతోషంగా జీవించలేరు. వారి మనసుపై కూడా ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇది పిల్లలు ఎదగకుండా అడ్డుకునే వాతావరణం కల్పిస్తుంది. తల్లిదండ్రుల స్వభావం వల్లే పిల్లలు అభివృద్ధిని కోల్పోతారు.
ప్రతి నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ నెంబరు 8 అవుతుంది. ఈ సంఖ్యను పాలించేది శని దేవుడు. వీరికి క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. నిజాయితీగా జీవించేందుకు ఇష్టపడతారు. న్యాయ పద్ధతిలో ఆలోచిస్తారు. ఎంతో కృషి చేస్తారు. అలాంటి వ్యక్తులకు పుట్టిన పిల్లలు కూడా అలాగే ఉండాలని వారు కోరుకుంటారు. పిల్లలను కఠినమైన క్రమశిక్షణలో పెంచడానికే ఇష్టపడతారు. దీనివల్ల పిల్లల్లో తిరుగుబాటు ప్రవర్తన వచ్చే అవకాశం ఉంది. తమలాగే తమ పిల్లలు కూడా చాలా కష్టపడి పనిచేయాలని కోరుకుంటారు. దీనివల్ల పిల్లలు తమకు ఇష్టమైన పనులు చేయలేరు. అలాంటి వాతావరణం కూడా ఇంట్లో ఉండదు.