న్యూమరాలజీ ప్రకారం.. ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలకు గురు గ్రహం అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్తకు మంచి అదృష్టాన్ని తెస్తారు. వీరు అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత భర్త జీవితంలో క్రమశిక్షణ, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. తమ భర్త క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరు ఇచ్చే సలహాలు అతన్ని విజయ పథంలో నడిపిస్తాయి. వీరు ఇంటిని చక్కదిద్దడంలోనే కాకుండా, భర్త ఎదుగుదలకు వెన్నెముకలా నిలుస్తారు.