Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది, జరగబోయేది ముందే తెలిసిపోద్ది

Published : Jun 13, 2025, 12:16 PM IST

ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తితో వార ఏదైనా సంఘటన జరగకముందే పసిగట్టగలరు. అలాంటి సామర్థ్యం వీరిలో ఉంటుంది.

PREV
15
ప్రత్యేకమైన శక్తి

న్యూమరాలజీ ప్రకారం, మన పుట్టిన తేదీ.. మన వ్యక్తిత్వం, జీవిత విధానం, అంతర్లీన శక్తులపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు అసాధారణమైన అంతర్ దృష్టి, ఆధ్యాత్మిక మేధస్సు, మానసిక శక్తులతో ప్రసిద్ధి చెందుతారు. అంటే ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తితో వార ఏదైనా సంఘటన జరగకముందే పసిగట్టగలరు. అలాంటి సామర్థ్యం వీరిలో ఉంటుంది. మరి, ఆ స్పెషల్ నాలుగు తేదీలేంటో తెలుసుకుందామా...

25
నెంబర్ 2..

ఏ నెలలో అయినా 2వ తేదీలో జన్మించిన వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఏదైనా బుర్రతో కాకుండా, మనసుతో ఆలోచిస్తారు. వీరికి మానసికంగా స్పందించే శక్తి ఉంటుంది. వీరు ఇతరుల భావాలు, అవసరాలు ఎవరూ చెప్పకుండానే వీరు అర్థం చేసుకోగలరు. అడగకముందే అవసరంలో ఉన్న వారికి సహాయం చేసేస్తారు. చాలా మంచి మనసులు. మానవత్మంతో ప్రవర్తిస్తారు. ఏదైనా ప్రమాదం జరగబోతున్నా కూడా వీరికి ముందుగానే తెలిసిపోతుంది.

35
నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9 వ తేదీలో పుట్టిన వారికి కూడా ఒక స్పెషల్ శక్తి ఉంటుంది. ఈ తేదీలో జన్మించిన వారు చాలా కరుణతో ఉంటారు. వీరు ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరులకు సేవ చేయడంలో ముందుంటారు, వీరికి మానవతా విలువలు చాలా ఎక్కువ. వారు తమ జీవితాన్ని ఇతరులకు సేవ చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికే వాడతారు. వీరికి కూడా జరగబోయే మంచైనా, చెడు అయినా వీరికి ముందుగానే తెలిసిపోతుంది.

45
నెంబర్ 16..

ఏ నెలలో అయినా 16వ తేదీలో జన్మించినవారు ఆధ్యాత్మికంగా అత్యంత అభివృద్ధి చెందిన వ్యక్తులుగా పరిగణిస్తారు.ఈ తేదీ కర్మను సూచిస్తుంది, కాబట్టి ఈ వ్యక్తులు జీవితంలో ముఖ్యమైన మార్గమార్పులను అనుభవిస్తారు. వీరికి కలల రూపంలో సందేశాలు రావచ్చు, భవిష్యత్తును ఊహించగల నైపుణ్యం ఉంటుంది. అమూర్తమైన భావనలను స్పష్టంగా అర్థం చేసుకునే ప్రత్యేక శక్తి వీరిలో ఉంటుంది.

55
నెంబర్ 25..

25వ తేదీలో జన్మించినవారు అంతర్దృష్టి ,సాంకేతిక స్వేచ్ఛ మధ్య సమతుల్యత కలిగి ఉంటారు. వీరిలో ఆధ్యాత్మికతపై గాఢ ఆసక్తి ఉంటుంది. ఏదైనా పరిణామం జరగకముందే, దాని ప్రభావాన్ని ఊహించే సహజ నైపుణ్యం వీరికి ఉంటుంది. వీరు ఏ పరిస్థితినైనా లోతుగా విశ్లేషించే సామర్థ్యంతో సామరస్యంగా జీవించగలుగుతారు.

ఈ నాలుగు తేదీల్లో జన్మించినవారికి విశేషమైన ఆధ్యాత్మికత, అంతర్గత శక్తి, సమాజానికి మార్గనిర్దేశం చేసే గుణాలు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories