Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండనుంది?
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులవారికి ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం..
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులవారికి ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం..
2025 మార్చి30 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులవారికి ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం..
విశ్వావసు నామ సంవత్సరం మేష రాశివారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది. ఏడాది ప్రారంభంలో అనుకూలతలు కనిపిస్తాయి. గురుడు వృషభరాశిలో సంచారించడంతో ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. శుభకార్యాలు జరిగే అవకాశముంది. అయితే మే నెల తర్వాత కొన్ని సవాళ్లు ఎదురయ్యే సూచనలున్నాయి.
ఆర్థిక పరిస్థితి: సంవత్సర ఆరంభంలో ఆర్థికంగా బలంగా ఉంటారు. ఉద్యోగస్తులకు వేతన పెంపు, వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ, మే నెల తర్వాత ఖర్చులు అధికమవుతాయి. పెట్టుబడులు వేశే ముందు సంతకం చేసే ఒప్పందాలను సరిచూసుకోవడం మంచిది.
ఆరోగ్య పరిస్థితి: సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మే నుండి ఆకస్మిక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెంచాలి.
ఉద్యోగ-వ్యాపార పరిస్థితి: ఉద్యోగస్తులకు తొలి మూడు నెలలు అనుకూలంగా ఉంటాయి. కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగ విరమణ, బదిలీలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణకు మే నెల తర్వాత కొన్ని ఆటంకాలు రావచ్చు.
వృషభ రాశివారికి విశ్వావసు సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది. ముఖ్యంగా ఆర్థికంగా, వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం పరంగా కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు.కొన్ని నెలల్లో అన్నీ అనుకూలంగా ఉన్నా, కొన్ని నెలలో సమస్యలు ఎదురౌతాయి. అయితే..వ్యాపారులకు మాత్రం కాస్త లాభదాయకంగానే ఉంటుంది. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. బంధాలు మెరుగౌతాయి. ఏప్రిల్ నుంచి గురు గ్రహ ప్రభావం కారణంగా కాస్త ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కానీ, మే నెల తర్వాత గురు గ్రహం మిథున రాశిలోకి మారడంతో ఆ సమస్యలు తగ్గి, అంతా అనుకూలంగా మారుతుంది. శని మీన రాశిలోకి అడుగుపెట్టడం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది.
ఆర్థిక పరిస్థితి..
ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అందిస్తుందని చెప్పొచ్చు. గురు బలహీన స్థితిలో ఉండటంతో 2025 ప్రారంభంలో వ్యయాలు అధికంగా ఉండే అవకాశముంది. ఆకస్మిక ధన నష్టాలు సంభవించవచ్చు కాబట్టి ఖర్చులను గమనించి పెట్టుబడులు పెట్టాలి. మధ్య కాలంలో అదృష్టం కాస్త మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తాయి. శని మీన రాశి సంచారం కారణంగా 2025 ద్వితీయార్థంలో అకస్మాత్తుగా ధన లాభాలు వస్తాయి. రాహువు ప్రభావంతో కొంత వ్యయ భారమైతే ఉంటుంది కానీ, సంవత్సరాంతానికి ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.
ఆరోగ్య స్థితి
వృషభరాశివారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం తొలి భాగంలో శారీరక సమస్యలు వేధించే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. మధ్య కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకోవాలి. ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం ముఖ్యం. 2025 చివరి నెలల్లో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రాహువు, కేతువుల ప్రభావం వల్ల వ్యాధులపట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారం & వృత్తి
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రగతి మందకొడిగా ఉంటుంది. మార్చి నెల తర్వాత ఉద్యోగ మార్పుల అవకాశాలు వస్తాయి. మధ్యలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు శని మిశ్రమ ప్రభావం చూపించనుంది. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. 2025 రెండో భాగంలో వ్యాపారాలలో స్థిరత కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి.
ఈ ఉగాది సంవత్సరం మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఏడాది తొలి భాగంలో గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఫలితంగా వారు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. కానీ ఏడాది మధ్యలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.గురు, శని, రాహు, కేతువుల సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మానసిక ఆందోళన, అనుకోని ఖర్చులు, కుటుంబ సంబంధిత సమస్యలు ఎదురౌతాయి.అయితే, సంతానం, ఉద్యోగం, వ్యాపారం వంటి అంశాల్లో మాత్రం పురోగతి సాధించగలరు. ఈ విషయంలో చాలా సంతృప్తి చెందుతారు.
ఆర్థిక పరిస్థితి:
ఆర్థిక వ్యవహారాల్లో ఈ సంవత్సరం ప్రారంభం కొంత మిశ్రమంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు ఆచితూచి వేయడం మంచిది. ఆగస్టు నెల తర్వాత మెరుగైన ధన యోగం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి రియల్ ఎస్టేట్, భూమి కొనుగోలు అవకాశాలు ఉన్నాయి. అప్పులు, రుణప్రయత్నాలు మధ్యభాగంలో విజయవంతం కావచ్చు.
ఆరోగ్య పరిస్థితి...
ఈ సంవత్సరం మిథున రాశివారికి ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొలి మూడు నెలల్లో మానసిక ఒత్తిడి, కంటి సమస్యలు, అలసట పెరిగే అవకాశం ఉంది. కాలం మారినప్పుడు జలుబు, దగ్గు, అలర్జీలు చికాకు పెడతాయి. ఆహార నియమాలు పాటించకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. నడుం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది.
వ్యాపారం & ఉద్యోగం
వ్యాపారం చేసే వారికి ప్రారంభంలో కొంత మందకొడిగా సాగినప్పటికీ, మే నెల తర్వాత స్పష్టమైన లాభదాయక పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పెట్టుబడులు సురక్షితంగా ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలసి వస్తుంది. ప్రమోషన్లు, వేతనవృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే, మధ్య తరగతి ఉద్యోగులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మార్పులు, బదిలీలు ఉండొచ్చు.
ఈ విశ్వావసు నామ ఉగాది సంవత్సరంలో మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. గురు బలం వల్ల ఆర్థిక, కుటుంబ, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో కొంత అభివృద్ధి జరుగుతుంది. కానీ శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల కొన్ని సవాళ్లు ఎదురౌతాయి. ఈ ఏడాది చాలా కష్టపడితే తప్ప విజయాలు అందుకోలేరు. ముఖ్యంగా ఆర్థిక నిర్వాహణ, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్థిక పరిస్థితి
ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మే నెల నుంచి అక్టోబర్ వరకు ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణానికి ఇది అనుకూల సంవత్సరం.
ఆరోగ్యం..
ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. శరీరానికి సరైన విశ్రాంతి కల్పించాలి. మధుమేహం, రక్తపోటు, నరాల బలహీనత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చలికాలంలో ఆరోగ్యంపై అధిక శ్రద్ధ అవసరం.
ఉద్యోగ, వ్యాపారాల పరిస్థితి..
ఉద్యోగస్తులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్, బదిలీ అవకాశాలు ఉంటాయి. పై అధికారులతో సంబంధాలను మెరుగుపరచుకోవాలి. జూలై-అక్టోబర్ మధ్య ఉద్యోగ మార్పులు ఉండొచ్చు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది.వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కానీ కొత్త పెట్టుబడులు వేసే ముందు సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలి. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. వ్యాపార సంబంధాలు మెరుగుపరచుకోవడం వల్ల లాభదాయక ఫలితాలు వస్తాయి.
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలు లభించనున్నాయి. కొన్ని నెలలు అంతా సవ్యంగా సాగుతుంది. వారు ఏది చేసినా విజయం సాధించగలరు. కానీ, కొన్ని నెలలు మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. శని అష్టమ సంచారం వల్ల ఆరోగ్య, కుటుంబ, ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. గురు మిథున రాశి సంచారం వల్ల మే 15 తర్వాత అనేక అనుకులతలు లభిస్తాయి. రాహు కుంభ రాశి ప్రవేశంతో కొంత ఊరట లభించినప్పటికీ, కేతువు జన్మ రాశిలో సంచరించడం వల్ల కొంత ఒత్తిడి, మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు రాకపోవచ్చు. కానీ కష్టపడితే అనుకొన్నవి సాధించే అవకాశం ఉంది.
ఆర్థిక స్థితి
సంవత్సర ఆరంభం నుంచి మధ్య వరకు ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ధననష్టం జరుగుతుండటంతో ఖర్చులను నియంత్రించడం అవసరం. అప్పులు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. మే 15 తర్వాత కొంత ఊరట లభించి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులకు అప్పటికే ఉన్న పెట్టుబడులపై కొంత లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యయ నియంత్రణ పాటిస్తే ఈ సంవత్సరం ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.
ఆరోగ్యం
శని అష్టమ సంచారం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండటంతో అలసట, నిద్రలేమి సమస్యలు తలెత్తొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు చికిత్సను నిర్లక్ష్యం చేయకూడదు. మే 15 తర్వాత ఆరోగ్య స్థితిలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, ఆహార నియమాలు పాటించాలి.
ఉద్యోగం & వ్యాపారం
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలసివచ్చే విధంగా లేదు. కొన్ని నెలల్లో ఉత్సాహంగా ఉన్నా, ఇతర సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది. పదోన్నతులు ఆలస్యమయ్యే అవకాశముంది. వ్యాపారులకు ఏడాది మొదటి భాగం అనుకూలంగా లేకపోయినా, మే 15 తర్వాత అభివృద్ధికి అవకాశాలు కనిపిస్తాయి. కొత్త పెట్టుబడులకు ఇది అంతగా అనుకూలమైన సమయం కాదు. నిరుద్యోగులు కొంత కష్టపడి ప్రయత్నిస్తే నవంబర్ తర్వాత అవకాశాలు అందుకుంటారు.
ఈ ఏడాది కన్య రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. గురు, శని, రాహు, కేతు గ్రహాల ప్రభావం వల్ల కొంత వరకు ఆర్థిక లాభాలు చూసే అవకాశం ఉంది. కానీ కొన్ని అనుకోని ఆటంకాలు, ఖర్చులు, ఆరోగ్య సమస్యలు కూడా ఎదురౌతాయి.మే నెల వరకు గురు వృషభ రాశిలో ఉండటం వల్ల కొత్త అవకాశాలు, ప్రయాణాలు, ధనప్రాప్తి, భూ సంబంధమైన లావాదేవీలు కలుగుతాయి. ఆ పై గురు మిథున రాశిలో ఉండటం వల్ల కుటుంబంలో ఒత్తుడులు, ఉద్యోగంలో పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. అంతేకాదు, శని మీన రాశిలో సంచారం కారణంగా సంతానం, కుటుంబ సంబంధ సమస్యలు వస్తాయి. కుటుబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక పరిస్థితి
ఈ ఏడాది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలే ఎదురుకానున్నాయి. ఆదాయ వృద్ధి చోటుచేసుకున్నా, ఖర్చులు కూడా తగినంతగా పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది కొంత లాభదాయకంగా ఉంటుంది. భూములు, ఇళ్ల కొనుగోలుకు ఇది మంచి కాలం. అయితే, రాహువు ప్రభావం వల్ల ఏప్రిల్-మే వరకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది.
ఆరోగ్య పరిస్థితి
సంవత్సర మొదటి భాగంలో ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉంటే, మే-జూలై మధ్యకాలంలో శారీరక అలసట, ఒత్తిడి పెరుగుతుంది. తలనొప్పి, కడుపు సమస్యలు, జీర్ణ సంబంధ ఇబ్బందులు వచ్చే అవకాశముంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మారిన వాతావరణ ప్రభావం వల్ల జలుబు, కఫ సంబంధిత సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం ఎంతో అవసరం.
ఉద్యోగం - వ్యాపార ఫలితాలు
ఉద్యోగస్తులకు ఈ ఏడాది మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. పదోన్నతులు రావచ్చు, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, మే-జూన్ మధ్య కాలంలో పనిభారం పెరుగుతుంది. అధిక ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోయే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభదాయక సంవత్సరం అయినప్పటికీ, ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అవినీతికి, అపవాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తుల రాశివారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. బృహస్పతి గ్రహం మే నుంచి తొమ్మిదో స్థానంలో సంచరించడంతో మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. శని ఆరో స్థానంలో ఉండటంతో కష్టాలు, బాధలు తొలగిపోతాయి. రాహువు ఐదో స్థానంలో, కేతువు పదకొండో స్థానంలో ఉండటంతో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది ఉద్యోగులకు ప్రమోషన్లు, వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే.. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థిక పరిస్థితి:
ఈ సంవత్సరం తులా రాశి వారికి ఆర్థికంగా మంచి స్థిరత్వం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం జరగవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. పెట్టుబడులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు తెలిసినవారిని సంప్రదించాలి.
ఆరోగ్యం:
ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం తులా రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. శరీర బాధలు, మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే, శారీరక సమస్యలు ఎక్కువగా ప్రభావితం కావు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం.
ఉద్యోగం & వ్యాపారం:
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు లభించవచ్చు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలరు. అధికారులతో అనుకూలంగా మెలగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన కాలం. నూతన వ్యాపార అవకాశాలు రాబోవచ్చు. నూతన ప్రాజెక్టుల పెట్టుబడులకు ఇది మంచి సమయం.
విశ్వావసు నామ సంవత్సరంలో తుల రాశి కుటుంబ జీవితం & సంబంధాలు:
కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనడం ద్వారా ఆనందకరమైన అనుభవాలు పొందగలరు. పిల్లల వల్ల కొన్ని ఆందోళనలు రావచ్చు. బంధుమిత్రులతో సఖ్యతతో ఉండటం మంచిది. ముఖ్యంగా మే నెల తర్వాత బంధువులతో మేలిమి సంబంధాలు ఏర్పడతాయి.
విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలు అందనున్నాయి. గురుడు ఏడాది మొదట్లో వృషభంలో సంచరించడం వల్ల కొన్ని శుభ ఫలితాలు పొందుతారు.ఆర్థికంగా కొంత నిలదొక్కుకుంటారు. కానీ, అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. శని మీన రాశిలో సంచరించడం వల్ల కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని చికాకులు ఎదురైనా ఉద్యోగ, వ్యాపారాలు మాత్రం చాలా మంచిగా వృద్ధి చెందుతాయి.
విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి..
ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అకస్మాత్తుగా డబ్బు రావొచ్చు, కానీ అదికూడా తగిన విధంగా ఖర్చు చేయాలి. స్థిరాస్తి కొనుగోలు లేదా పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. వ్యాపారస్తులకు లాభనష్ట సమంగా ఉంటుంది. మే నుండి రాహువు కుంభ రాశిలోకి వెళ్తే ఆర్థికంగా కొన్ని సానుకూల మార్పులు కనబడతాయి. రుణాల మీద ఎక్కువ ఆధారపడకూడదు.
విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఆరోగ్య పరిస్థితి
శని మీన రాశిలో ఉండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు కొంత బాధించవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. గురుడు అష్టమస్థానంలో ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, నిద్రలేమి కలగవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఉద్యోగం & వ్యాపారం
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. అయితే, పని ఒత్తిడి పెరుగుతుంది. పదోన్నతికి అవకాశాలు ఉంటాయి, కానీ సహోద్యోగులతో సమన్వయం తప్పనిసరి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. కొన్ని నెలలు లాభదాయకంగా ఉంటే, కొన్ని నెలల్లో సమస్యలు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు ముందు పూర్తి పరిశీలన చేయాలి.
ఈ విశ్వావసు నామ సంవత్సరం ధనస్సు రాశివారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో కొంత అశాంతి నెలకొనవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు మరింత ఆలస్యం కావచ్చు. దీని వల్ల మీరు మరింత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అయితే, మే నెల తర్వాత గురుడు మిథున రాశిలోకి అడుగుపెట్టడం వల్ల మీ పరిస్థితులు మళ్లీ మెరుగౌతాయి. అప్పటి నుంచి మళ్లీ అంతా మంచే జరుగుతుంది. కొత్త అవకాశాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. శని మీన రాశిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. అందుకే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీరసం, ఒత్తిడి ఎక్కువ ఉండటంతో మానసిక ప్రశాంతతకు దూరం అయ్యే అవకాశం ఉంది. అయితే, కాలక్రమేనా ఆ సమస్యలన్నీ కూడా సద్దుమణుగుతాయి.
విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఆర్థిక స్థితి:
ఆర్థికపరంగా ఈ సంవత్సరం కొంత ఒడిదుడుకులతో ప్రారంభమైనా, మే నెల తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. ఆదాయ మార్గాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొంత వెనుకబడిన పరిస్థితి కనిపించినా, అక్టోబర్ నాటికి లాభదాయక మార్గాలు ఏర్పడతాయి. అప్పులు ఉన్నవారు క్రమంగా వాటిని తీర్చగలుగుతారు. స్థిర ఆస్తి కొనుగోలు చేసే యోచనలో ఉన్నవారు కొంత ఆలస్యం చేయడం మంచిది. ఖర్చులు అధికంగా ఉండటంతో పొదుపు మీద దృష్టి పెట్టడం ఉత్తమం. అకస్మాత్ ధననష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఆరోగ్య పరిస్థితి:
శని మీన సంచారం వల్ల ఈ ఏడాది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, అనారోగ్య సూచనలు కనిపించవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు, పిత్త సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఆరోగ్య రీత్యా మార్చి, ఆగస్టు, డిసెంబర్ నెలలు కొంత ప్రతికూలంగా ఉండే సూచనలు కనపడుతున్నాయి. మే నెల తర్వాత శారీరకంగా కొంత మెరుగైన అనుభూతి లభించవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు దూరం అవుతాయి.
విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఉద్యోగ, వ్యాపార పరిస్థితి:
ఉద్యోగస్తులకు ఈ ఏడాది ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనిభారంతో పాటు కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, మే నెల తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. పదోన్నతులు, ఉద్యోగ మార్పుల విషయంలో మే – జూన్ నెలలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా, అక్టోబర్ తర్వాత లాభసాటిగా మారే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు వేయాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఖర్చులను నియంత్రించకపోతే వ్యాపారంలో నష్టాలు తప్పవు.
విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉండనుంది.గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశివారు ఎదుర్కొంటున్న ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు ఈ ఏడాదిలో తగ్గిపోవడం ఖాయం. గురు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో శాంతి నెలకుంటుంది. కొంతకాలంగా ఎదురైన చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులు, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. శని మీన రాశిలో ఉండటం వల్ల ఉద్యోగంలో కూడా మంచి జరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఈ ఏడాది ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగులుగుతారు.
విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి ఆర్థిక స్థితి:
ఈ సంవత్సరం ఆర్థికపరంగా మకరరాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాహువు మే 2025 నుండి రెండవ స్థానంలో సంచరించడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ఖర్చులు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల పొదుపు ధోరణిని అలవర్చుకోవడం అవసరం. నూతన పెట్టుబడులు పెట్టే ముందు సరైన ఆలోచన చేయాలి.
విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి ఆరోగ్య పరిస్థితి:
ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మే నెల తర్వాత కేతువు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేలా మెడిటేషన్, యోగాను అలవాటు చేసుకోవడం మంచిది. శరీర సంబంధిత చిన్నచిన్న సమస్యలు ఎదురుకావచ్చు. పాత అనారోగ్య సమస్యలు తిరిగి రావచ్చు. రాహు ప్రభావం వల్ల తలనొప్పులు, గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.
విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి ఉద్యోగ, వ్యాపార స్థితి:
ఉద్యోగస్తులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగంలో కొంత ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కష్టపడి పని చేసిన వారికి ఇప్పుడు ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి సెకండ్ హాఫ్ మంచి అవకాశాలు తెస్తుంది. వ్యాపారస్తులకు ఇది అభివృద్ధికి దారితీయగలదని చెప్పొచ్చు. కొత్త పెట్టుబడులకు మంచి సమయం. వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు కొనసాగించే ముందు సరైన ప్రణాళిక చేసుకోవాలి. విదేశీ వ్యాపార లావాదేవీలకు కొంత అవరోధాలు ఎదురవచ్చు.
విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి మిశ్రమంగా ఉండనుంది. గ్రహ స్థితుల ప్రభావం కారణంగా కొన్ని అనుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, వాటిని చూసి సంతోషించేలోగా.. ప్రతికూలపరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఏలినాటి శని చివరి దశలో ఉండటంతో దాని ప్రభావం గట్టిగా ఉంటుంది. చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బృహస్పతి మే నెలలో రాశి మారడం వల్ల మీరు కోరుకున్నవి జరిగే అవకాశం ఉంది. రాహువు జన్మ రాశిలో అడుగుపెట్టినప్పుడు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి.కుటుంబ పరంగా ఒత్తిడి, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రావచ్చు. అయితే.. ఆత్మ స్థైర్యంతో ఎదుర్కొని నిలపడితే విజయం మీకు దక్కే అవకాశం ఉంటుంది.
విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి ఆర్థిక పరిస్థితి:
ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా వచ్చిన ఖర్చులు అదుపులో లేకుండా పోవచ్చు. మే నెల తర్వాత వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులకు కొంత స్థిరమైన స్థితి లభించవచ్చు. అప్పులు తీసుకోవడం, ఇస్తే జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ధనలాభం కూడా సంభవించొచ్చు కానీ వాటిని ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు చేయాలంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొందరికి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించవచ్చు.
విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి ఆరోగ్య పరిస్థితి:
ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కుంభ రాశి వారికి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. మే తర్వాత గురు గ్రహ ప్రభావం కొంత వరకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పటికీ, రాహువు ప్రభావం వల్ల ఆకస్మిక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. యోగం, ధ్యానం వంటి చర్యలు పాటిస్తే మంచిది.
విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి ఉద్యోగ వ్యాపార పరిస్థితి:
ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం కొంత ఒత్తిడితో కూడినదిగా ఉంటుంది. బదిలీలు, ఉద్యోగ మార్పులు జరగవచ్చు. కొన్ని సమస్యలు అధిగమించినా, కొన్ని కొత్తగా ఎదురవుతాయి. వ్యాపారవేత్తలకు మధ్యస్థంగా ఉంటుంది. మే నెల తర్వాత కొంత మెరుగైన పరిస్థితులు ఉండొచ్చు. కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారాలు జాగ్రత్తగా నిర్వహించాలి. ఉద్యోగస్తులు పై అధికారులతో మెలకువగా వ్యవహరించాలి. రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది.
విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశివారికి మధ్యస్థంగా ఉండనుంది.ఈ ఉగాది రోజునే శని మీన రాశిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ శని జన్మరాశి సంచారం వల్ల కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. గురుడు అనుకూల స్థానంలో ఉండటంతో కొన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. రాహువు, కేతువు సంచారం వల్ల కొన్ని అనుకోని మార్పులు,ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది.
విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఆర్థిక పరిస్థితి
ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాహువు ద్వాదశ రాశి సంచారం వల్ల ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించాలి. వ్యాపారస్తులు పెట్టుబడులకు శ్రద్ధ వహించాలి. సరైన ప్రణాళికలతో వెళితే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఆకస్మిక ధన లాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.
విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఆరోగ్య పరిస్థితి
ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఎదురుకావచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శనివారం తైలాభిషేకం చేయడం, ధ్యానం, యోగం వంటి చర్యలు మంచివి.
విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఉద్యోగ వ్యాపార పరిస్థితి
ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉంటాయి. బదిలీలు, కొత్త బాధ్యతలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు వేయాలంటే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొంతకాలానికి పరిస్థితి మెరుగవుతుంది.