నెంబర్ 2..
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 2 తేదీల్లో పుట్టిన వారు చాలా నిజాయితీ పరులు. అంటే.. ఏ నెలలో అయినా సరే 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 2 కిందకే వస్తారు. వీరిని చంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సున్నితంగా,సౌమ్యంగా ఉంటారు. వీలైనంత వరకు అందరికీ ప్రేమ పంచడానికే ప్రయత్నిస్తారు. అంతేకాదు వీరు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించాలంటే అది వీరి వల్లే సాధ్యం అవుతుంది. ఇతరుల నుంచి ఏదీ ఆశించరు. అంతేకాదు ఈ తేదీల్లో పుట్టినవారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే,అస్సలు వదిలిపెట్టరు.