మేషరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విశ్వావసు నామ సంవత్సరం మొదటి నెలలో మేష రాశి వారికి అభివృద్ధి, తేజస్సు పెరుగుతుంది. ధర్మ కార్యాల్లో పాల్గొంటారు. జన్మ శని ఉంది. ప్రతిరోజు హనుమంతుడిని పూజిస్తే మంచి జరుగుతుంది.
వృషభ రాశి
ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి పురోగతి నెమ్మదిగా ఉంటుంది. ప్రయత్నం, ఓపిక ఉండాలి. ఖర్చులపై దృష్టి సారించాలి. ఈ రాశి వారు దుర్గాదేవిని పూజించడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి జన్మ కుజ బాధ ఉంది. ఓపికగా ఉండాలి. వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. ఆదాయం కష్టమవుతుంది. కుల దేవతను దర్శించుకుంటే అంతా శుభం జరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి రవి, చంద్ర, గురు గ్రహాల వల్ల శుభం జరుగుతుంది. కీర్తి, గుర్తింపు లభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవ చేసుకోవడం మంచిది.
సింహ రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి ఏప్రిల్ మాసం పోటా పోటీగా ఉంటుంది. మీ అనుభవం, ఓపిక ఉపయోగపడతాయి. దుర్గాదేవి, నాగదేవతలను పూజిస్తే మంచి జరుగుతుంది.
కన్య రాశి
విశ్వావసు నామ సంవత్సరం మొదటి నెల కన్య రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశివారు కోరికలు నెరవేర్చుకోవడానికి సాహసంతో ముందుకు సాగుతారు. అంతా మంచే జరుగుతుంది. దుర్గాదేవి, గణపతిని పూజించడం మంచిది.
తుల రాశి
తుల రాశి వారికి శుభ కార్యాల్లో పురోగతి ఉంటుంది, కుటుంబంలో మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి. కులదేవతను దర్శించుకుంటే మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి అనేక సవాళ్లు, పరీక్షలు ఎదురుకావచ్చు. తొందరపాటు నిర్ణయాలు, మాటలు ప్రమాదకరంగా మారవచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది. నవ గ్రహాలను పూజిస్తే మంచి జరుగుతుంది.
ధనుస్సు రాశి
ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎక్కువ పని ఉంటుంది. ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి. ఒత్తిడి ఎక్కువ. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. ఈశ్వరుడిని పూజిస్తూ ఉండటం వల్ల మేలు జరుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి చాలా వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహ, వరాహస్వామిని దర్శించుకోవడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి యాత్రలు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం.
మీన రాశి
మీన రాశి వారు ఆశలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం చేయడం మంచిది. దేనికి భయపడవద్దు. నవగ్రహ శాంతి చేయించుకోవడం మంచిది.