జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా సంవత్సరాల తర్వాత మిథున రాశిలో త్రి ఆదిత్య యోగం ఏర్పడనుంది. దీనివల్ల 5 రాశులవారికి పట్టిందల్లా బంగారం అవుతుందట. వారు కోరుకున్నవన్నీ నెరవేరుతాయట. మరి ఏ రాశులవారికి త్రి ఆదిత్య యోగం అదృష్టం తీసుకువస్తుందో ఇక్కడ చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశిలో జూన్ 22 నుంచి బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు. ఈ రాశిలోనే సూర్యుడు, గురువు కలిసి గురు ఆదిత్య యోగాన్ని ఏర్పరుస్తారు. జూన్ 24 నుంచి చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. దీనివల్ల శశి ఆదిత్య యోగం ఏర్పడుతుంది.
ఫలితంగా వచ్చే వారం మిథున రాశిలో త్రిమూర్తుల యోగం ఏకకాలంలో ఏర్పడుతుంది. ఈ సమయం 5 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి ఏ రాశుల వారికి త్రి ఆదిత్య యోగం సిరి, సంపదలను మోసుకువస్తుందో ఇక్కడ చూద్దాం.
26
మిథున రాశి వారిపై త్రి ఆదిత్య యోగం ప్రభావం
త్రి ఆదిత్య యోగం మిథున రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు ఉండవచ్చు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆనందం, సౌకర్యం పెరుగుతాయి. ఈ రాశి వారికి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.
అంతేకాదు ఈ సమయంలో ప్రారంభించిన అన్ని పనుల్లో వీరు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది.
36
కన్య రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?
కన్య రాశి వారికి త్రి ఆదిత్య యోగం శుభప్రదం. ఈ రాశి వారు తమ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వారు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు. పరిపాలనకు సంబంధించిన పనుల్లో లాభం పొందవచ్చు.
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక రంగాల్లో పనిచేసే వారి గౌరవం పెరుగుతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.
ధనుస్సు రాశి వారికి త్రి ఆదిత్య యోగం ప్రయోజనం చేకూరుస్తుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారులు కూడా సహాయం చేస్తారు.
భాగస్వామ్య వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇంట్లో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది.
56
కుంభ రాశి వారిపై త్రి ఆదిత్య యోగం ప్రభావం..
కుంభ రాశి వారికి త్రిఆదిత్య యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. సృజనాత్మక రంగంతో సంబంధం ఉన్నవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ఉద్యోగంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఏ పనినైనా ఎంత ఉత్సాహంగా మొదలుపెడతారో అంతే ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. ప్రశాంతంగా ఉంటారు.
66
మీన రాశి వారిపై త్రి ఆదిత్య యోగం ప్రభావం..
మీన రాశి వారికి త్రి ఆదిత్య యోగం చాలా మేలు చేస్తుంది. సిరి, సంపదలకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. జీవితం మరింత సంతోషంగా సాగుతుంది.
చిన్ననాటి మిత్రులతో విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. తల్లి తరఫు నుంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. వారితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.